RRR చుట్టూ ఎన్నో సమస్యలు

By iDream Post Sep. 10, 2020, 03:33 pm IST
RRR చుట్టూ ఎన్నో సమస్యలు

కరోనా కేసులు పూర్తిగా తగ్గినా తగ్గకపోయినా స్టార్ హీరోలు మెల్లగా షూటింగులకు వచ్చేస్తున్నారు. నాగార్జున, నాగ చైతన్య, వైష్ణవ్ తేజ్, సాయి తేజ్ ఇప్పటికే సెట్లో అడుగుపెట్టేయగా ట్రయిల్ అండ్ ఎర్రర్ లాగా ఉంటుందని మహేష్ బాబు కూడా నిన్న యాడ్ షూట్ లో పాల్గొనడం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి. రేపో మాపో వెంకటేష్ నారప్ప, చిరంజీవి ఆచార్య లైట్స్ ఆన్ కెమెరా యాక్షన్ చెప్పబోతున్నాయి. ఇక ఇప్పుడు అందరి కన్ను ఆర్ఆర్ఆర్ మీద పడుతోంది. వైరస్ బారిన పడినప్పటికీ రాజమౌళి అండ్ టీమ్ దాని నుంచి పూర్తిగా కోలుకుంది. ఇంకెవరికి ప్రమాదం లేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు జక్కన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.

ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనే విషయం గురించి ఇప్పటికే టీమ్ తో చర్చలు జరుగుతున్నాయట. ముఖ్యంగా అలియా భట్, ఒలీవియాల డేట్లు పెద్ద సమస్యగా మారబోతున్నాయి. హీరోలిద్దరూ అందుబాటులో ఉన్నారు కానీ మిగిలిన క్యాస్టింగ్ అంత ఫ్రీగా లేరు. అజయ్ దేవగన్, సముతిరఖని లాంటి ఇతర బాషా ఆర్టిస్టుల కాల్ షీట్స్ ని ప్లాన్ చేసుకోవాలి. లొకేషన్లు చూసుకోవాలి. పర్మిషన్లు వగైరా మునుపటి లాగా వస్తాయో లేదో తేల్చుకోవాలి. సెట్టింగులు, అవుట్ డోర్, గ్రీన్ మ్యాట్ తదితరాలకు సంబంధించిన పనులు చాలా ఉంటాయి. నిర్మాత దానయ్య డెబ్భై శాతం పూర్తయ్యిందని ఆ మధ్య అన్నారు కానీ అసలు పార్ట్ మొత్తం బ్యాలన్స్ లోనే తీయాల్సి ఉందని ఇన్ సైడ్ టాక్. అందుకే ఆర్ఆర్ఆర్ వ్యవహారం అంత తేలికగా కనిపించడం లేదు.

మరోవైపు రామ్ చరణ్ ఆచార్య కోసం డేట్లు ఇవ్వాలి. అది కూడా రాజమౌళితో అండర్ స్టాండింగ్ ని బట్టి డిసైడ్ చేయాలి. ఇంకోవైపు తారక్ ఇప్పటికే రెండున్నర ఏళ్ళు గడిపేశాడు. అవతల త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నారు. పోనీ రెండూ చేద్దామంటే గెటప్ సమస్య. ఆర్ఆర్ఆర్ లో గుబురు గెడ్డం మీసాలతో ఉండే జూనియర్ కొత్త ప్రాజెక్ట్ కోసం పూర్తిగా మేకోవర్ కావాలి. ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ లాంగ్ డిస్కషన్ చేస్తోందని వినికిడి. వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయలేకపోతే 2022 సంక్రాంతికి వెళ్లడం తప్ప వేరే మార్గం ఉండదు. ఏ ముహూర్తంలో మొదలయ్యిందో కానీ లాక్ డౌన్ కు ముందు నుంచే ఆర్ఆర్ఆర్ కు ఎన్ని అవాంతరాలు వచ్చి పడ్డాయో లెక్కే లేదు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ మల్టీ స్టారర్ రిలీజ్ మీద ఇప్పుడప్పుడే ఆశలు పెట్టుకోకపోవడం ఉత్తమం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp