మరో తమిళ్ హీరో - తెలుగు దర్శకుడు కాంబో ఫిక్స్

By Balu Chaganti Oct. 06, 2021, 09:30 pm IST
మరో తమిళ్ హీరో - తెలుగు దర్శకుడు కాంబో ఫిక్స్

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని పెద్దలు అన్నట్టు ఇప్పుడు తమిళ హీరోలు - తెలుగు దర్శకులు, అలాగే తెలుగు హీరోలు - తమిళ దర్శకుల కాంబినేషన్లు రెండు భాషల సినిమా ఇండస్ట్రీలోనూ ఆసక్తికరంగా మారాయి. గతం నుంచి చూస్తే కనుక తమిళ దర్శకులు తెలుగు హీరోలను డైరెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ తెలుగు దర్శకులు నేరుగా తమిళ హీరోలను తెలుగులో నటింపజేయడం అనే ట్రెండ్ ఇప్పుడే మొదలైంది. అలాగే తమిళ దర్శకులు - తెలుగు హీరోల కాంబినేషన్లు కూడా ఆసక్తికరంగా మారాయి.

ప్రస్తుతం లైన్లో ఉన్న తమిళ హీరో - తెలుగు దర్శకుల ప్రాజెక్టులను పరిశీలిస్తే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక సినిమా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా ఒక సినిమా రూపొందుతున్నాయి. ఇవికాక ధనుష్ -వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడని అలాగే పూరి జగన్నాథ్ సూర్య కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందబోతోంది అని ప్రచారాలు జరుగుతున్నాయి. అంతకుముందు శివకార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ ఒక సినిమా చేయబోతున్నాడు అని ప్రచారం జరగగా తాజాగా దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. డాక్టర్ వరుణ్ అనే సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్న శివకార్తికేయన్ ఆ సినిమాని ప్రమోట్ చేసే పనిలో భాగంగా హైదరాబాద్ వచ్చారు.

బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే అంతకు ముందు మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే శివకార్తికేయన్ పూర్తిగా తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నానని తాను చేస్తున్న తెలుగు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే నిర్మాతలు వెల్లడిస్తారని చెప్పుకొచ్చారు. ఇక అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్ గా రష్మికను ఫైనలైజ్ చేశారని అంటున్నారు.. అలాగే ఈ సినిమాను ఇటీవలే లవ్ స్టోరీ సినిమా చేసి హిట్ కొట్టిన శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పీ బ్యానర్ మీద నిర్మించనున్నారు. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందించి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Also Read: కొత్త ట్రెండుకు దారి తీస్తున్న టాక్ షోలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp