మిగిలిన సినిమాల మాటేమిటి ?

By Ravindra Siraj Feb. 15, 2020, 11:53 am IST
మిగిలిన సినిమాల మాటేమిటి ?

నిన్న అందరి దృష్టి విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మీదే ఉంది కానీ దాంతో మరో మూడు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. కాకపోతే స్టార్ క్యాస్టింగ్ తో సహా అన్ని రాజీ పడిన ప్రాజెక్ట్స్ కావడంతో ఇవి జనం దృష్టికి వెళ్ళలేదు. దీంతో డల్ ఓపెనింగ్స్ తప్పలేదు. లవర్ గురించి రిపోర్ట్స్ వచ్చేశాయి కాబట్టి మిగిలిన వాటి మీద చిన్న లుక్ వేద్దాం. ట్రైలర్ తో ఓ మాదిరి ఆసక్తి రేపిన చిత్రం ఒక చిన్న విరామం. డైరెక్టర్ గా మారిన డాక్టర్ సందీప్ దర్శకత్వంలో సంజయ్ వర్మ, గరీమా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్.

మిల్క్ బిజినెస్ చేసే ఓ జంటకు అందులో నష్టాలు రావడంతో అందులో రుచి తెచ్చే డ్రగ్స్ కలిపి లాభాలు పెంచుకునే డీల్ ఒకటి వస్తుంది. అయితే దాని వెనుక చాలా చిక్కులు ఉంటాయి. ఇది వేరే పరిణామాలకు దారి తీస్తుంది. దాన్నుంచి వాళ్లిద్దరూ ఎలా బయటపడ్డారు అనేదే కథ. పాయింట్ బాగున్నప్పటికీ ఆకట్టుకునే స్థాయిలో టేకింగ్ మరియు రైటింగ్ లేకపోవడంతో ఒక చిన్న విరామం పూర్తి స్థాయిలో ఆకట్టుకునే అవకాశాలు తక్కువే.

ఇక సురేష్ తిరుమూరు దర్శకత్వంలో వచ్సిన మరో సినిమా లైఫ్ అనుభవించు రాజా. రవితేజ, శ్రావణి, శృతి హీరో హీరోయిన్లు. కథ సింపుల్. ఓ అబ్బాయి లైఫ్ లో సెటిల్ కాకపోవడం వల్ల ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిపోయి ఆ అమ్మాయి వేరేవాడిని చేసుకుని వెళ్ళిపోతుంది. దాంతో విరక్తి చెందిన హీరో హిమాలయాలకు వెళ్లిపోతాడు. అక్కడ ఇంకో అమ్మాయి కనిపించి ప్రేమలో పడతాడు. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటే జీవితంలో సక్సెస్ అయ్యాక కనిపించమని చెబుతుంది. మరి ఈ లవ్ అయినా నిలుస్తుందా లేదా అనేదే బాలన్స్ కథ.

లైన్ పర్వాలేదు అనిపించినా మేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నా స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ అంత ఎఫ్ఫెక్టివ్ గా లేకపోవడంతో ఇది సగటు సినిమా కంటే కింది స్థాయిలో నిలుస్తుంది. ఇక శివ 143 కూడా ఒకరకమైన లవ్ అండ్ యాక్షన్ డ్రామా. ఒక కొరియోగ్రాఫర్ జీవితంలో ప్రేమ ప్రవేశించాక ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు అనే పాయింట్ మీద హీరో కం దర్శకుడు సాగర్ శైలేష్ తీసిన విధానం సోసోగానే అనిపిస్తుంది. మొత్తానికి వరల్డ్ ఫేమస్ లవర్ తో పోటీ పడిన ఈ మూడు సినిమాల ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని ట్రేడ్ రిపోర్ట్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp