బాలయ్య కోసం ప్రత్యేక ఆకర్షణలు

By iDream Post May. 06, 2021, 01:38 pm IST
బాలయ్య కోసం ప్రత్యేక ఆకర్షణలు
ప్రస్తుతం అఖండ పూర్తి చేసే పనిలో ఉన్న నందమూరి బాలకృష్ణ దీని తరువాత క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది కూడా ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో మొదలై రకరకాల మలుపులు తీసుకుంటుందని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే ఈ కథ కోసం మలినేని పాత లైబ్రరీలకు వెళ్లి అప్పటి సంఘటనల తాలూకు పేపర్ క్లిప్పింగ్స్, సమాచారం వగైరా సేకరించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా చేసుకుని బాలయ్య మార్క్ హీరోయిజంతో పాటు మంచి మెసేజ్ ఇందులో ఇవ్వబోతున్నారట. అఖండ ఇంకో రెండు వారాల వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ నెల 13 నుంచి మొదలుపెట్టే ఆలోచనలో టీమ్ ఉంది.

ఇదిలా ఉండగా గోపిచంద్ మలినేని సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉంటాయట. ఇద్దరు హీరోయిన్లలో ఇప్పటికే శృతి హాసన్ ని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. మరొక హీరోయిన్ ఎవరో తేలాల్సి ఉంది. అయితే శృతి నిజంగా ఓకే చెప్పిందా లేదా అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది. ఇంత సీనియర్ హీరోతో గతంలో తను నటించకపోవడమే దీనికి కారణం. మరో విశేషం ఏంటంటే ఇందులో బాలయ్య చాలా ఏళ్ళ తర్వాత ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తారట. అఖండలో ఈ గెటప్ ఉన్నప్పటికీ ఒకప్పటి సమరసింహారెడ్డి స్టైల్ లో గోపిచంద్ తన సినిమాలో ప్రెజెంట్ చేస్తారని వినికిడి.

మొత్తానికి బాలకృష్ణ ఇప్పటి తరం దర్శకులతో ఎక్కువ పని చేయడానికి ఆసక్తి చూపడం అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. సీనియర్లనే పేరుతో కెఎస్ రవికుమార్ లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా తమ హీరో నష్టపోవడం చూసి ఇకపై వాళ్ళు వద్దు అంటున్నారు. బి గోపాల్ తో చేయాల్సిన సినిమా కూడా ఈ కారణంగానే పెండింగ్ లో ఉండిపోయినట్టు కనిపిస్తోంది. మే 28న రావాల్సిన అఖండను కొత్త డేట్ కి ఇంకా లాక్ చేయలేదు. పరిస్థితిని బట్టి దీనికన్నా ముందు వాయిదా పడ్డ సినిమా తేదీలను చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేయబోతున్నారు. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలియనున్నాయి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp