షాకిచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ తో మహేష్ సర్కార్

By iDream Post Oct. 03, 2021, 04:30 pm IST
షాకిచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ తో మహేష్ సర్కార్

నిన్న ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాక మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా ఇరకాటంలో పడింది. ముందు అనుకున్న జనవరి 13 డేట్ నుంచి మార్చాలా లేక ఉగాదికి షిఫ్ట్ అయిపోయి సేఫ్ గేమ్ ఆడాలా అనే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. నేరుగా ఆర్ఆర్ఆర్ తో క్లాష్ కు దిగడం ఖచ్చితంగా కలెక్షన్ల మీద ప్రభావం ఉంటుంది. అందులోనూ రాజమౌళి సినిమా పాన్ ఇండియా కాబట్టి తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో థియేటర్ల కౌంట్ విషయంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు ఏప్రిల్ 1తో మొదలుపెట్టి పలురకాల ఆప్షన్లు చూస్తున్నారు నిర్మాతలు.

ఇదిలా ఉండగా దర్శకుడు పరశురామ్ అభిమానుల అంచనాలకు మించి ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసినట్టు లీకైన సోర్స్ ని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో విలన్ సముతిరఖని మహేష్ ల మధ్య వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ ఒక్కడు, పోకిరి తర్వాత ఆ స్థాయి గూస్ బంప్స్ ఇచ్చే స్థాయిలో వచ్చిందట. ప్రిన్స్ ని ఎన్నడూ చూడని హీరో పాత్ర నరసింహావతారం అనే రేంజ్ లో గుడి సెటప్ లో దీన్ని ప్రొజెక్ట్ చేశారట. ఇటీవలే షూట్ చేసిన యూనిట్ నుంచి బయటికి వచ్చిన మాటలను బట్టి ఫిలిం నగర్ లో ఈ చర్చ జరుగుతోంది. నిజమా కదా అనేది నిర్ధారించలేం కానీ ఊరికే ఇంత స్పష్టంగా ఉన్న గాసిప్స్ బయటికి రావుగా.

ఆర్ధిక నేరాల బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సర్కారు వారి పాట మహేష్ గెటప్ కూడా మాస్ గా ఉండబోతోంది. మహర్షి, భరత్ అనే నేను, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరూ సినిమాల్లో మరీ క్లాసీ లుక్స్ తో ఫ్యాన్స్ కూడా ఒకరకంగా మొనాటనీ ఫీలవుతున్నారు ఒకప్పటి మహేష్ మాస్ బాడీ లాంగ్వేజ్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఆ కోరిక సర్కారు వారి పాటతో నెరేవేరబోతోంది. తమన్ కూడా అలాంటి ట్యూన్సే సిద్ధం చేశాడట. ఒక ఐటెం సాంగ్ కూడా ఉండబోతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మరి వేసవికి వస్తుందా ఉగాదికి ఓకె అవుతుందా వేచి చూడాలి

Also Read : 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp