డిజిటల్ రూట్లో గోపిచంద్ ?

By iDream Post May. 08, 2021, 01:00 pm IST
డిజిటల్ రూట్లో గోపిచంద్ ?
అంతా సవ్యంగా కుదిరి ముందే ప్లాన్ చేసుకున్న ఏప్రిల్ 2నే సీటిమార్ రిలీజై పోయి ఉంటే ఎంత లేదన్నా మూడు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని సేఫ్ అయ్యేది. ఒకవేళ హిట్ టాక్ వస్తే కలెక్షన్ల పరంగానూ అద్భుతాలు జరిగేవి. కానీ మంచి ఛాన్స్ మిస్ అయ్యింది. ఏవో ఆర్థిక కారణాలో లేక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యమో బయటికి చెప్పలేదు కానీ మొత్తానికి వాయిదా తప్పలేదు. అదే రోజు వైల్డ్ డాగ్, సుల్తాన్ లతో పోటీ పడకపోవడం మంచిదేనని అభిమానులు ముందు అనుకున్నారు కానీ వాటి ఫలితాలు చూశాక సీటిమార్ మిస్ చేసుకున్నది ఏంటో తెలిసి వచ్చింది. ఇప్పుడో కొత్త అప్డేట్ చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం సీటిమార్ ఫ్రెష్ గా ఓటిటి ఆప్షన్ వైపు కూడా చూస్తోందట. ఫైనాన్సియల్ సెటిల్ మెంట్లు ఇంకా కొలిక్కి రాకపోవడంతో పాటు  థియేటర్లు తెరుచుకోవడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉండటం, మరోవైపు కనివిని ఎరుగని రీతిలో  భారీ పోటీ అనివార్యం లాంటి కారణాల వల్ల నిర్మాత డిజిటల్ ఆప్షన్ గురించి కూడా ఆలోచిస్తున్నారట. ఇది నిజమని చెప్పేందుకు అధికారిక ప్రకటన ఏదీ లేదు కానీ మొత్తానికి నిప్పు లేనిదే పొగరాదు తరహాలో చర్చలైతే జరుగుతున్నాయని తెలిసింది. ఒకవేళ వాస్తవమైతే చాలా గ్యాప్ తర్వాత ఒక పెద్ద హీరో సినిమా ఓటిటి బాట పట్టినట్టు అవుతుంది. కానీ అధికారికం అయ్యే దాకా ఏదీ నమ్మలేం

గోపిచంద్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కనీసం యావరేజ్ అని చెప్పుకునే సినిమా కూడా లేదు. అయినా కూడా సీటిమార్ కు బడ్జెట్ భారీగానే ఖర్చు పెట్టారు. మాస్ మీద మంచి పట్టున్న దర్శకుడు సంపత్ నందితో చేసిన గౌతమ్ నందా ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ  సబ్జెక్టు మీద నమ్మకంతో గోపీచంద్ సీటిమార్ కు ఎస్ అన్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో తమన్నా హీరోయిన్ కాగా మణిశర్మ సంగీతం అందించారు. క్రీడా నేపధ్యమే అయినప్పటికీ మసాలా అంశాలకు కొదవ లేకుండా సీటిమార్ ని రూపొందించినట్టు ఇప్పటికే టాక్ ఉంది. చూద్దాం ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారో
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp