సర్కారు కానుక ఇచ్చారు కానీ

By iDream Post Aug. 09, 2020, 09:48 am IST
సర్కారు కానుక ఇచ్చారు కానీ
ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి ఊరిస్తూ వచ్చిన సర్కారు వారి పాట గిఫ్ట్ మోషన్ పోస్టర్ రూపంలో రిలీజయింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో  టైటిల్ సాంగ్ ని ఓ ఫీమేల్ వాయిస్ పాడగా రూపాయి కాసుతో పాటు మహేష్ చేతికి ఉన్న ఓం లాకెట్ హై లైట్ అయ్యేలా కొత్తగా ప్లాన్ చేశారు. అయితే కొంచెం కూడా ప్రిన్స్ ఫేస్ రివీల్ చేయకపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించేదే. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు కాని కనీసం ఓ ఫోటో షూట్ చేసి అయినా వదలాల్సిందిని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నప్పటికీ సెట్స్ పైకి వెళ్ళాకే ఇలాంటివి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. 

ఏది ఏమైనా ఒక పాట ఎలా ఉంటుందన్న ఐడియా అయితే వచ్చింది. ఉన్న కొద్ది సెకండ్ల సర్కారు వారి పాట ట్రాక్ మరీ కొత్తగా అనిపించలేదు కానీ సరిలేరు నీకెవ్వరులో ఎపుడు ప్యాంటేసే వాడు సౌండింగ్ తరహాలో వినిపించడం గమనార్హం. పూర్తి సాంగ్ విన్నాక ఒపీనియన్ మారొచ్చు. అనంత శ్రీరామ్ దీనికి సాహిత్యం సమకూర్చారు. హారిక నారాయణ్ గాత్రం అందించారు. ఇప్పటిదాకా హీరొయిన్ గా కీర్తి సురేష్ పేరే గట్టిగా వినిపిస్తోంది మరోసారి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరో కథానాయిక కూడా ఉంటుందన్న టాక్ ఉంది కానీ అదెవరు అనేది ఇంకా తెలియలేదు.  తమన్ పాటల రికార్డింగ్ కొనసాగిస్తున్నట్టు తెలిసింది. 

మైత్రి, 14 రీల్స్, జిఎంబి బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట షూట్ ని దసరా నుంచి మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. వైరస్ విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది కాబట్టి ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకోవడం దర్శక నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారింది. అందుకే ఎలాంటి నిర్ణయం వెలువరించలేకపొతున్నారు. సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబుకి ఇకపై కనీసం ఏడాది గ్యాప్ తప్పేలా లేదు. ఎంత వేగంగా పూర్తి చేసినా సంక్రాంతి విడుదల ఛాన్స్ లేదు కాబట్టి సమ్మర్ ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక నేరాల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సర్కారు వారి పాటలో మహేష్ బాబు పాత్ర ఎలా ఉంటుందన్న సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది


Link Here @ https://bit.ly/33FYjjD

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp