అదే గేమ్ అదే గోల - శృతి మించిన డ్రామా

By iDream Post Oct. 22, 2020, 01:07 pm IST
అదే గేమ్ అదే గోల - శృతి మించిన డ్రామా

ఈసారి బిగ్ బాస్ 4 జరుగుతున్న తీరు చూస్తుంటే వంద రోజుల వ్యవధి చాలా ఎక్కువ అనిపిస్తోంది .సెలెబ్రిటీ కంటెస్టెంట్లు లేకపోవడం ఇప్పటికే ఒక మైనస్ గా నిలవగా సాగదీస్తున్న టాస్కులతో బోర్ కొట్టిస్తూ దీనికన్నా ఐపిఎల్ చూసుకోవడమే బెటర్ అన్న ఫీలింగ్ ని ప్రేక్షకులకు కలగజేస్తోంది. ఉంటే పైత్యం లేదా శూన్యం అన్న తరహాలో గేములు రాను రాను బోర్ కొట్టిస్తున్నాయి. మొన్న మొదలు పెట్టిన మంచి మనుషులు vs కొంటె రాక్షసులు నిన్న కూడా సాగదీశారు. యథావిధిగా సభ్యులు చేసే ఓవరాక్షన్ ఇందులో కూడా కొనసాగింది కానీ అది కూడా ఏమంత ఆసక్తిగా సాగలేదు. ఈసారి రాక్షసుల టీమ్ విజయం సాధించింది. ఓ సర్కిల్ గీసి అందులో మంచి మనుషులు ఉండాలని చెప్పాడు బిగ్ బాస్.

అందులో మూటలు బయటికి విసిరేస్తూ ఉండాలి. అలా జరక్కుండా రాక్షసులు అడ్డుకుంటారు. అయితే ఎవరైనా మనుషులు ఆ గీత దాటి బయటికి వస్తే అవుట్ అయినట్టే. కానీ అందులో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. దీంతో రాక్షసుల బృందం ఈ టాస్కులో విజేతగా నిలిచింది. అందరిలోకి ఆస్కార్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది మాత్రం అరియనానే. రాక్షసిగా బెస్ట్ అవార్డు కొట్టేయడం ఖాయం. ఆపోజిట్ టీమ్ తో బాగా ఆడుకుంది. అవినాష్ రాక్షసుడి టీమ్ లోనే ఉన్నప్పటికీ అమ్మాయిలతో పులిహోర ప్రోగ్రాం కంటిన్యూ చేశాడు. మోనాల్ హగ్గులు ఇవ్వడమే హౌస్ లో ఉండడానికి అర్హత అనుకుందో ఏమో అందరికీ నో అనకుండా వాటిని ప్రసాదించేసింది. అరియనా-మోనాల్-అవినాష్ ల మధ్య జరిగిన ట్రాక్ బాగా ఓవర్ అయ్యింది.

తర్వాత టాస్కు విషయానికి వస్తే ఖాళీగా ఉన్న డ్రమ్ములను కుండలతో నీళ్లు తెచ్చి నింపడమనే పనిని మంచి మనుషులకు ఇచ్చారు. రాక్షసులు అడ్డుపడాలి. ఇది కామన్. ఇందులో మంచి ఫిజికల్ ఫైట్ దొరికింది మెంబెర్స్ కు. అఖిల్, మెహబూబ్ ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. తోసుకునే దాకా వెళ్ళింది వ్యవహారం. డ్రమ్ములను స్విమ్మింగ్ పూల్ లో వేయడం దాని మీద హాట్ డిస్కషన్ జరగడం అంతా ఇదే సరిపోయింది. వాదోపవాదాలు ఎలా ఉన్నా ఫైనల్ గా ఈ టాస్క్ లో మనుషులే విజేతలుగా నిలిచారు. ఇలా పడుతూ లేస్తూ సాగిన బిగ్ బాస్ 4 ఒకరకంగా విపరీత చేష్టలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమయ్యే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటోంది. కాస్త చూసుకోవడం బెటర్. అసలే వీక్ డే రేటింగ్స్ చాలా మోస్తరుగా ఉన్నాయి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp