తారక్ బన్నీలది ఒకే నిర్ణయం

By iDream Post May. 29, 2020, 11:39 am IST
తారక్ బన్నీలది ఒకే నిర్ణయం

లాక్ డౌన్ వేళ రెండు నెలలకు పైగా ఇంట్లోనే గడపాల్సి రావడంతో స్టార్ హీరోలు ఎవరికి వారు తమకు తోచిన రీతిలో సమయాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు . కొందరికది చేయబోయే సినిమాల పరంగా ఉపయోగపడుతుండగా మిగిలిన వాళ్లకు ఆ ఆప్షన్ లేకపోతే హోం థియేటర్లో ఎంటర్ టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ బాలన్స్ వర్క్, అల్లు అర్జున్ పుష్ప రెగ్యులర్ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరికీ ఒక సారుప్యత ఉంది. రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్నాయి.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హింది ఇలా మొత్తం ఐదు బాషలలో వీటిని ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఇందులో కొత్తేముంది తెలిసిందేగా అనకండి. ఇంకో మ్యాటర్ ఉంది. తారక్, బన్నీ ఇద్దరూ తమ స్వంత గొంతులనే డబ్బింగ్ కోసం ఇవ్వబోతున్నారు. అన్ని బాషలకు వీళ్ళే గాత్రం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఆ మధ్య వదిలిన ఆర్ఆర్ఆర్ వీడియో టీజర్ లో ఇప్పటికే యంగ్ టైగర్ తమిళ్ హింది ఎంత స్పష్టంగా పలకగలడో రుజువైపోయింది. మిగిలినవి కూడా గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నాడట. అదే తరహాలో పుష్ప కోసం బన్నీ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో కావాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అందుకే లాక్ డౌన్ టైంలో బాషలను నేర్చుకునేందుకు ఆన్ లైన్ లో స్పెషల్ ట్యూటర్ ద్వారా వీడియో క్లాసులు తీసుకుంటున్నాడట. కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ మొదటిసారి స్వంతంగా డబ్బింగ్ చెప్తే ఖచ్చితంగా హైప్ ఇంకా పెరుగుతుంది. గతంలో చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలు హిందీలో స్ట్రెయిట్ సినిమాలు చేసినప్పటికీ డబ్బింగ్ ఇచ్చే సాహసం చేయలేకపోయారు. కాని జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ఆలోచించడం మంచి నిర్ణయమే. మమ్ముట్టి తరహాలో ఇలాంటి ట్రెండ్ కి శ్రీకారం చుడితే ముందు ముందు మరికొందరు కూడా ఇదే దారిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp