డిసెంబర్లో సమంతా డిజిటల్ ఎంట్రీ

By iDream Post Sep. 26, 2020, 07:17 pm IST
డిసెంబర్లో సమంతా డిజిటల్ ఎంట్రీ

ఎందుకనో మజిలీ తర్వాత ఏ కొత్త సినిమా ఒప్పుకోని సమంతా ఇప్పటికీ కొత్త కథలు పట్టుకుని ఎందరు వచ్చినా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇకపై పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని రెగ్యులర్ స్టోరీస్ వద్దని మొహం మీదే చెబుతోందట. తనను ఇప్పట్లో చూడలేమా అని అభిమానులు చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే ఇందులో తనది పాజిటివ్ క్యారెక్టర్ కాదు. విశ్వసనీయ సమాచారం మేరకు పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా నెగటివ్ షేడ్స్ తో చాలా డిఫరెంట్ గా కనిపించబోతోందట. మనోజ్ బాజ్ పాయ్ టైటిల్ రోల్ చేస్తున్న ఫ్యామిలీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది.

తెలుగువాళ్ళయిన రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించిన దీనికి గత ఏడాది బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కింది. ప్రాంతీయ భాషల్లోనూ డబ్బింగ్ చేయడంతో ఎక్కువ శాతం ఆడియన్స్ చూసే అవకాశం కలిగింది. సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచే దీని మీద అంచనాలు మొదలయ్యాయి. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఫ్యామిలీ మ్యాన్ 1కి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఇప్పుడీ కొనసాగింపుని తీర్చిదిద్దారట. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. డిసెంబర్ చివరి వారంలో విడుదల చేసేందుకు ప్రైమ్ ప్లానింగ్ లో ఉంది. సమంతాకు ఇది ఖచ్చితంగా ఛాలెంజింగ్ రోలే. తమిళంలో సూపర్ డీలక్స్ లోనూ నెగటివ్ తరహా పాత్ర చేసింది కానీ ఎందుకో మన నిర్మాతలు దాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు ఆసక్తి చూపించలేదు.

ఒరిజినల్ వెర్షన్ హైదరాబాద్ లో రిలీజైనప్పుడు, ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు మనవాళ్ళు సబ్ టైటిల్స్ తో సర్దుకున్నారు కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం మిస్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 2కి ఆ ఇబ్బంది లేదు. హ్యాపీగా తెలుగులో కూడా చూసేయొచ్చు. మూడో సీజన్ కూడా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అందులో కూడా సామ్ కంటిన్యూ అవుతుందా లేక తనకు సెకండ్ పార్ట్ లోనే ఎండింగ్ ఇచ్చేస్తారా వేచి చూడాలి. ఇదంతా బాగానే ఉంది కానీ ఉపాసనతో కలిసి బిజినెస్ లో కూడా అడుగుపెట్టిన సమంతా మెల్లగా తెరకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉందేమో. అయినా దానికి ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా టైం తీసుకోవచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp