వెంటాడుతున్న సాహో

By Rahul.G Dec. 07, 2019, 12:56 pm IST
వెంటాడుతున్న సాహో

సాహోకి ఆర్థికంగా పెద్ద న‌ష్టం జ‌ర‌గ‌లేదు కానీ, ప్ర‌భాస్‌కి, యువి క్రియేష‌న్స్‌కి కావ‌ల‌సినంత చెడ్డ‌పేరు మాత్రం వ‌చ్చింది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌కి ఉన్న ఇమేజ్ వ‌ల్ల సాహో డిజాస్ట‌ర్ నుంచి త‌ప్పించుకుంది కానీ, నిజానికి ఇది డిజాస్ట‌రే. ద‌ర్శ‌కుడు సుజిత్ ఐదేళ్లుగా సాహో క‌థను సిద్ధం చేసుకున్నాడు. కానీ ఎక్కువ రుద్దితే గుండ్రాయి కూడా అరిగిపోతుంది. సాహో కూడా అలాగే అరిగి ఏదో అంతు తెలియ‌ని బ్ర‌హ్మ ప‌దార్థం బ‌య‌టికొచ్చింది. సాహోకి జ‌రిగిన వేస్టేజ్‌లో రెండు చిన్న సినిమాలు ఈజీగా తీయొచ్చు.

ఇప్పుడు ఇదే సంస్థ ప్ర‌భాస్‌తో జాన్ మూవీని కూడా తీస్తోంది. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కూడా చాలా ఏళ్లుగా క‌థని సిద్ధం చేస్తున్నాడు. సాహో ఎఫెక్ట్‌తో ఇప్పుడు ప్ర‌భాస్‌కే కాదు, యువి సంస్థ‌కు కూడా భ‌యం ప‌ట్టుకుంది. రాధాకృష్ణ స్క్రిప్ట్‌ని ఒక‌టికి ప‌దిసార్లు చెక్ చేస్తున్నారు. కానీ ఒక్కోసారి ఎక్కువ వంట‌వాళ్లు క‌లిసినా ప్ర‌మాద‌మే. జాన్‌ని కిచిడీగా మార్చినా మారుస్తారు. మొత్తానికి సాహో ఎఫెక్ట్ ప్రభాస్ నటిస్తున్న జాన్ పై గట్టిగానే పడిదంటున్నారు సినీ విశ్లేషకులు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp