విభిన్న‌మైన యాక్ష‌న్ థ్తిల్ల‌ర్‌గా ‘సాహో’

By iDream Post Jan. 20, 2018, 11:25 am IST
విభిన్న‌మైన యాక్ష‌న్ థ్తిల్ల‌ర్‌గా ‘సాహో’

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ ‘బాహుబలి’ చిత్రాల‌తో హీరో ప్ర‌భాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో తెలిసిందే..! అప్ప‌టిదాకా డార్లింగ్ ప్ర‌భాస్‌గా ఇండ‌స్ట్రీ పిలుచుకునే ఈ హీరో వెండితెర బాహుబ‌లిగా మారిపోయాడు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ త‌రువాత సినిమాపై  స‌హ‌జంగానే ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన ఆస‌క్తి నెల‌కొంది. బాహుబ‌లి త‌రువాత‌ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను యాక్షన్‌‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్న‌ట్టు స‌మాచారం. అయితే ఓ సూప‌ర్ కాప్ లాంటి పాత్ర‌నా.. లేక‌. విలన్ షేడ్స్‌లో ఉండే ఓ విభిన్న‌మైన క్యారెక్ట‌రా అన్న‌దానిపై ప‌లుర‌కాల వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ‘సాహో’ను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే..! బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్  ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయికగా మెర‌వ‌నుంది. ఈ సినిమా కథలో శ్రద్ధా పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యం ఉందని ఇటీవల ప్రభాస్‌ మీడియాతో చెప్ప‌డం విశేషం. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, అరుణ్‌ విజయ్‌, జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ వ్య‌యంతో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్‌ నిపుణులు పనిచేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp