షురూ కాబోతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్

By iDream Post Oct. 04, 2020, 06:17 pm IST
షురూ కాబోతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్

మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక కారణం వల్ల బ్రేక్ పడుతూ వచ్చిన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు షూటింగ్ కు రంగం సిద్ధం చేసుకోబోతోంది. ఎప్పుడో కాదు రేపటి నుంచే షూట్ మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. హైదరాబాద్ లోనే శ్రీకారం చుట్టబోతున్నారు. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన క్వారెంటైన్ వ్యవహారాలు కూడా పూర్తి చేసినట్టు తెలిసింది. ఎవరైతే ఇందులో పాల్గొంటారో వాళ్లందరికీ అవసరమైన టెస్టులు చేయించి పూర్తి పాజిటివ్ రిపోర్ట్స్ తో తగినంత సమయం ఇంట్లోనే గడిపేలా చేయనిచ్చి పక్కా ప్లానింగ్ తో కొనసాగించబోతున్నారు.

అయితే హీరోయిన్లు అలియా భట్, ఒలీవియాలు ఎప్పటి నుంచి జాయిన్ అవుతారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఓ రెండు నెలలు తాను ఖాళీగానే ఉన్నట్టు ఈలోగా తన పార్ట్ ని పూర్తి చేయమని అలియా రాజమౌళిని కోరినట్టుగా గతంలోనే టాక్ వచ్చింది. అదే నిజమైతే తను వచ్చేందుకు ఎక్కువ టైం పట్టదు. తారక్ జోడి సంగతి తెలియాల్సి ఉంది. అసలు కరోనానే రాకపోయి ఉంటె సరిగ్గా ఇంకో మూడు నెలల్లో ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేది. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. వచ్చే వేసవికి టార్గెట్ చేసుకుంటున్నారు. చరణ్ మరోవైపు ఆచార్యకు డేట్స్ ఇవ్వాలి ఉంది. అది కూడా జక్కన్న ఎప్పుడు వదిలిపెడతాడు అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది అవ్వగానే యంగ్ టైగర్ కూడా త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ కు జాయినవ్వాలి. సో ఎంత వేగంగా పూర్తి చేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది.

ఎంతలేదన్నా వచ్చే జనవరి దాకా ఇది జరగవచ్చని టాక్. ఆపై ఓ మూడు నాలుగు నెలలు ప్రమోషన్లు పెట్టుకుంటే సమ్మర్ కి పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. బాహుబలి తరహాలో కరెక్ట్ టైమింగ్ తో భారీ వసూళ్లు రాబట్టుకోవచ్చు. ఇంకా పాటల చిత్రీకరణ కూడా బాలన్స్ ఉన్నట్టు తెలిసింది. కీరవాణి సంగీతం సమకూర్చిన ఆర్ఆర్ఆర్ కు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ కు థియేటర్లు ఫుల్ కెపాసిటీతో స్వాగతం చెప్పాల్సిందే. వచ్చే జనవరికంతా పరిస్థితి సద్దుమణుగుతుందనే అంచనాలు ఉన్నాయి కాబట్టి మునుపటి లాగే జన సందోహంతో సినిమా హాళ్లు పోటెత్తడం ఖాయం. కాకపోతే ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఎప్పుడు అనేదే ఇప్పటికైతే ఎవరు చెప్పలేని ఓ శేష ప్రశ్న

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp