రౌద్రం రణం రుధిరం : RRR సమరం

By iDream Post Mar. 25, 2020, 12:33 pm IST
రౌద్రం రణం రుధిరం : RRR సమరం

నిన్న ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వచ్చేసింది . టైటిల్ ని అలాగే ఉంచుతూ వాటి అర్థాలను మాత్రం కింద ఇచ్చి మొత్తానికి ఊహాగానాలకు చెక్ పెట్టేశారు. మొదటి ఆర్ అంటే రౌద్రం. నిప్పుకు ప్రతినిధిగా అల్లూరి సీతారామరాజు, మూడో ఆర్ అంటే రుధిరం, నీటికి సారధిగా కొమరం భీం, మధ్యలో రెండో ఆర్ ఈ ఇద్దరి కలిసి చేసే రణం అని అర్థం వచ్చేలా డిజైన్ చేశారు. రౌద్రం రుధిరం కలిసి చేసే రణం ఎలా ఉంటుందో చూడాలంటే వచ్చే ఏడాది జనవరి 8 దాకా వేచి చూడాల్సిందే.

మోషన్ పోస్టర్ వీడియోలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సైడ్ లుక్స్ మాత్రమే రివీల్ చేసిన టీం వాళ్ళ పూర్తి అవుట్ లుక్ మాత్రం ఇవ్వలేదు. ఇద్దరు చెరో వైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కలిపే థీమ్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కీరవాణి మరోసారి తన మార్క్ చూపించారు. విజువల్స్ చూపలేదు కాబట్టి ఇంతకన్నా విశ్లేషించడానికి ఏమి లేదు. ఇండియా బ్యాక్ డ్రాప్ లో 1920లో జరిగిన కథగా దీన్ని తీర్చిదిద్దినట్టు లోగో ద్వారా చెప్పేశారు.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టుగానే చిన్న ట్విస్ట్ తో లాంచ్ అయ్యింది. వచ్చే జనవరి 8 అని మరోసారి స్పష్టంగా చెప్పేశారు కాని కరోనా వల్ల జరిగిన ఆలస్యం ప్రభావం చూపబోదని అర్థమవుతోంది. టీజర్ వచ్చేదాకా అభిమానులు సర్డుకోక తప్పదు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ టైటిల్ సస్పెన్స్ ఈ విధంగానైనా తగ్గిపోయింది కాబట్టి ఇక వీడియో టీజర్ కోసం వెయిట్ చేయడమే. ఒకేసమయంలో ఐదు బాషల్లోనూ ఈ మోషన్ పోస్టర్ విడుదల చేయడం అప్పుడే సోషల్ మీడియాలో ట్రేండింగ్ కు దారి తీసింది.

Motion Poster Link @ bit.ly/2Uge4Zs

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp