తరుణ్ ఆర్తీల ప్రేమకథ గురించి

By iDream Post Jun. 28, 2020, 06:17 pm IST
తరుణ్ ఆర్తీల ప్రేమకథ గురించి

ఇప్పటి తరానికి రోజారమణి అంటే వెంటనే గుర్తుకురాకపోవచ్చు కాని లవర్ బాయ్ హీరో తరుణ్ మదర్ అంటే వెంటనే ఫ్లాష్ అవుతుంది. బాలనటిగా 1967లోనే భక్త ప్రహ్లాద ద్వారా యావత్ భారతదేశ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈవిడ అంత చిన్న వయసులోనే ఎన్నో పురస్కారాలు దక్కించుకున్నారు. తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రోజా రమణి స్వరం ప్రతిఒక్కరికి హీరొయిన్ల రూపంలో సుపరిచితమే. ముఖ్యంగా ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన ఎన్నో సినిమాల్లో మనకు నేరుగా కనిపించకపోయినా తెరవెనుక మాత్రం మాటలతో మాయాజాలం చేసేవారు రోజారమణి.

నటులు చక్రపాణిని పెళ్లి చేసుకున్నాక కలిగిన సంతానమే తరుణ్. తల్లి టాలెంట్ ని పుట్టుకతో పుణికి పుచ్చుకున్న తరుణ్ బాల్యంలోనే అంజలి, ఆదిత్య 369, తేజ, పిల్లలు దిద్దిన కాపురం లాంటి ఎన్నో చిత్రాల ద్వారా బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాక చదువు పూర్తి చేసి నువ్వే కావాలితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమానే చరిత్ర సృష్టించింది. యూత్ పూనకం పట్టినట్టు నువ్వే కావాలిని ఎగబడి చూశారు. ఒక్కదెబ్బకు తరుణ్ ఎందరో అమ్మాయిలకు హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు. ఇంటివద్ద నిర్మాతలు క్యులు కట్టారు. స్టార్లకు అంత సులభంగా సాధ్యం కాని ఇండస్ట్రీ రికార్డులను డెబ్యుతోనే సొంతం చేసుకోవడం చూసి అందరూ షాక్ తిన్నారు.

సహజంగానే స్నేహితులతో చనువుగా ఉండే తరుణ్ తనతో నటించిన హీరొయిన్లతోనూ ఫ్రెండ్ షిప్ చేసేవాడు. ఆ క్రమంలోనే ఆర్తి అగర్వాల్ తో లవ్ స్టొరీ గురించి అప్పటి మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. అనూహ్య పరిస్థితుల్లో ఆ అమ్మాయి ప్రమాదం వల్ల చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా తరుణ్ పేరుని బయటికి తెచ్చారు . అయితే ఈ ఇద్దరు కలిసి నటించింది రెండు సినిమాల్లోనే. నాలుగు సార్లు జంటగా నటించిన శ్రేయతో రాని గాసిప్స్ ఒక్క ఆర్తి విషయంలోనే లింక్ పెట్టారు కొందరు. దీంతో ఇది తల్లికి కొంత మనస్తాపం కలిగించినా తరుణ్ మాత్రం తన తప్పేమీ లేదని లైట్ తీసుకున్నాడు. ఇదంతా రోజా రమణి స్వయంగా వివరించిన అనుభవం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp