రవితేజ ముందు నాలుగు ఆప్షన్లు

By iDream Post Feb. 07, 2021, 12:08 pm IST
రవితేజ ముందు నాలుగు ఆప్షన్లు

క్రాక్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ కిక్ ని ఎంజాయ్ చేస్తున్న మాస్ మహారాజా ప్రస్తుతం రవివర్మ దర్శకత్వంలో ఖిలాడీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సమ్మర్ విడుదల టార్గెట్ చేసుకుని మే 28 డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ఇందులో మార్పు ఉండే అవకాశం ఉంది. దీని సంగతి ఎలా ఉన్నా రవితేజ ఇంకో రెండు నెలల్లో పూర్తిగా ఫ్రీ అవుతాడు. ఆ తర్వాత ఎవరితో చేస్తాడనే క్లారిటీ మాత్రం బయటికి రావడం లేదు. నేను లోకల్ ఫేమ్ నక్కిన త్రినాధరావు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు కానీ ఆయనకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే క్లారిటీ మిస్సవుతోంది. పైగా ఆయనా ఇంకే హీరోకి ఇప్పటిదాకా కమిట్ అవ్వలేదు.

మరోవైపు ప్రముఖ కథకుడు నా పేరు సూర్య డైరెక్టర్ వక్కంతం వంశీతో ఓ ప్రాజెక్ట్ ఉండొచ్చనే ప్రచారం జరిగాయి. ఇప్పుడీ రెండు పక్కకు తప్పుకుని రెండు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది గోపిచంద్ మలినేని అసిస్టెంట్ గులాబీ శీను చెప్పిన ప్రాజెక్ట్. క్రాక్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఓ లైన్ చెబితే రవితేజకు నచ్చిందని ఫుల్ నరేషన్ సిద్ధమయ్యాక ఫైనల్ చేద్దామని చెప్పినట్టు సమాచారం. అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది. నిర్మాత ఎవరనేది కూడా ఇంకా ఖరారు కాలేదు. శీను ఫైనల్ స్క్రిప్ట్ ని కనక రవితేజను ,మెప్పించగలిగేలా చెబితే ఇదే ఫైనల్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఇది కాకుండా తన కెరీర్లో మేజర్ బ్రేక్స్ ఇచ్చిన పూరి జగన్నాధ్ తో కూడా రవితేజ చేసే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ టాక్. 2012 దేవుడు చేసిన మనుషులు డిజాస్టర్ తర్వాత ఈ కాంబో రిపీట్ కాలేదు. అంతకు ముందు నాలుగు సినిమాలు వచ్చాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్నా తమిళ అమ్మాయి, నేనింతే. చివరిది తప్ప అన్నీ సూపర్ డూపర్ హిట్లే. ఇప్పుడిది ఓకే అయితే ఆరో సినిమా అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ తో తన మునుపటి ఫామ్ లోకి వచ్చిన పూరి ప్రస్తుతం లైగర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఓ సినిమా ఉండే అవకాశం అయితే లేకపోలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp