మరో క్రేజీ ప్రాజెక్టులో రష్మిక మందన్న

By iDream Post Nov. 22, 2020, 03:11 pm IST
మరో క్రేజీ ప్రాజెక్టులో రష్మిక మందన్న

ఇటీవలే వెకేషన్ కోసం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లొచ్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాగానే ఆర్ఆర్ఆర్ సెట్స్ కు వెళ్ళిపోయాడు. ఎప్పుడు పూర్తవుతుందో ఖచ్చితంగా తెలియదు కానీ మార్చ్ దాకా డేట్స్ లాక్ అయ్యాయని సమాచారం. దీని తర్వాత తారక్ తనకు అరవింద సమేత వీర రాఘవ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరోసారి జట్టు కడుతున్న సంగతి తెలిసిందే. అన్న కళ్యాణ్ రామ్ ని నిర్మాణ భాగస్వామిగా మార్చి త్వరలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది కానీ అది నిజమా కదా అనే క్లారిటీ యూనిట్ నుంచి రాలేదు.

ఇక తాజా అప్ డేట్ ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా రష్మిక మందన్న ఎంపికైనట్టు ఇన్ సైడ్ న్యూస్. ముందు కియారా అద్వానీని అనుకున్నప్పటికీ కాల్ షీట్స్ పరంగా సమస్య వచ్చే అవకాశం ఉండటంతో అందుబాటులో ఉన్న రష్మిక వైపే త్రివిక్రమ్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది. పూజా హెగ్డే పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందట. వరసగా రెండు సినిమాలు తనతోనే త్రివిక్రమ్ చేశాడు, అందులోనూ ఇదే హీరో హీరోయిన్ కాంబో అయిపోయింది కాబట్టి రష్మికకు ఈ ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్ చేసి అఫీషియల్ గా చెప్పడానికి తొందరేమీ లేదు కాబట్టి టైం పట్టొచ్చు.

రష్మిక మందన్న అసలే ఫుల్ స్వింగ్ మీద ఉంది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాక నితిన్ భీష్మ కూడా అదే ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. కార్తీతో నటించిన సుల్తాన్ రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఇప్పుడీ కాంబో కూడా సెట్ అయితే ఇప్పటికే పీక్స్ లో ఉన్న తన డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అరవింద సమేత లా కాకుండా త్రివిక్రమ్ ఈసారి ఎంటర్ టైనర్ ని జూనియర్ ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసినట్టు వినికిడి. ప్రస్తుతం తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సంక్రాంతికి లాంఛనంగా ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp