ఒకే ఒక్కడు తరహాలో మెగా మూవీ

By iDream Post Apr. 18, 2021, 12:30 pm IST
ఒకే ఒక్కడు తరహాలో మెగా మూవీ
ప్రస్తుతం ఇండియన్ 2తో పాటు అపరిచితుడు హిందీ రీమేక్ వివాదాలను ఏకకాలంలో ఎదురుకుంటున్న దర్శకుడు శంకర్ దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ప్రాజెక్ట్ కమిటై అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఒకే సినిమా తీసే శంకర్ ఇలా ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న అభిమానులను సైతం వేధిస్తోంది. తనవరకు వచ్చిన లీగల్ నోటీసులకు బదులిస్తున్నా కూడా ఈ వివాదాలు అంత సులభంగా చల్లారేలా కనిపించడం లేదు. పైగా ఆస్కార్ రవిచంద్రన్ కు ఇప్పుడు దర్శకులుగా రాణిస్తున్న శంకర్ శిష్యులకు మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రశ్న సమాధానాల యుద్ధం జరుగుతోంది.

వీటిని కాసేపు పక్కపెడితే రామ్ చరణ్ సినిమాని ఒకే ఒక్కడు స్టైల్ లో తీర్చిదిద్దబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి అవ్వడం అనే పాయింట్ ని తీసుకుని మంచి పొలిటికల్ థ్రిల్లర్ సిద్ధం చేశారట. ఎక్కడా పోలిక రాకుండా దీన్ని చాలా డిఫరెంట్ స్టైల్ లో తీర్చిదిద్దబోతున్నట్టు వినికిడి. యాక్షన్ కింగ్ అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రానా ఇలా చాలా తక్కువ హీరోలు తెరమీద సిఎంలుగా కనిపించారు. రామ్ చరణ్ నిజంగా ఈ క్యారెక్టర్ చేస్తే మాత్రం అభిమానులు ఉత్సాహం ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాలా. ఈ లీకులు ఎంత వరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్ గా కియారా అద్వానీ ఫిక్స్ అవ్వొచ్చని ముంబై టాక్. అపరిచితుడు హిందీ రీమేక్ లోనూ రన్వీర్ సింగ్  కు జోడిగా తననే తీసుకుని డబుల్ ప్యాకేజ్ ఆఫర్ ని ఇచ్చినట్టు తెలిసింది. అఫీషియల్ గా ఇంకా ఏదీ ప్రకటించలేదు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందే చరణ్ శంకర్ సినిమాలో కీలక తారాగణం మినహాయించి మిగిలినవారు ఏ భాషకాభాష విడివిడిగా ఉంటారు. సంగీత దర్శకుడిగా తమన్ లేదా అనిరుద్ రవిచందర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఇదే కావడంతో వార్తలు గట్టిగా తిరుగుతున్నాయి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp