ఆచార్యలో ఈ పోరాటాలే కీలకం

By iDream Post Jul. 11, 2021, 02:30 pm IST
ఆచార్యలో ఈ పోరాటాలే కీలకం

ఆచార్య షూటింగ్ కథ క్లైమాక్స్ కు వచ్చేసింది. గత రెండేళ్లుగా నిర్మాణంలో ఈ మెగా మూవీ కోసం దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే మూడేళ్ళకు పైగా సమయాన్ని ఖర్చు పెట్టాడు. సరిగ్గా ఇంకో పది పదిహేను రోజుల్లో గుమ్మడికాయ కొట్టేస్తారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో సోనూ సూద్ ఇతర ముఖ్యమైన తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఓ ఫైట్ కూడా ఉందట. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ భాగమంతా చాలా కీలకంగా ఉంటూనే అభిమానులు ఊహించనంత రేంజ్ లో చరణ్ విశ్వరూపం ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే తను పోషిస్తున్న సిద్దా పాత్ర తాలూకు విశేషాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సుమారు నలభై నిముషాలు కనిపించే సిద్దా ఇందులో గుడి సంరక్షకుడిగా కనిపిస్తాడు. దేవాలయం భూముల మీద కన్నేసిన సోనూ సూద్ ఆగడాలను అడ్డుకోవడం కోసం నక్సలైట్ గా మారిన ఆచార్యతో చేతులు కలుపుతాడు. అయితే ఈ పోరాటం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇద్దరిలో ఒకరి అజ్ఞాతవాసానికి దారి తీస్తుంది. దీనికంతా కారణం సోనూ సూద్ పాత్రే. సిద్ధ ప్రియురాలుగా చేస్తున్న పూజా హెగ్డే క్యారెక్టర్ కు కూడా ఒక మలుపు ఉంటుంది. హిందూ దేవాలయాల సంరక్షణ కాన్సెప్ట్ మీద కమర్షియల్ అంశాలు అన్నీ జోడించి కొరటాల శివ దీన్ని పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు సమాచారం

ఆచార్య విడుదల ఎప్పుడనే మీద వచ్చే నెల నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆగస్ట్ 22 చిరంజీవి బర్త్ డే ఉంది కాబట్టి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమోనని అభిమానులు ఆశిస్తున్నారు కానీ అలాంటి అవకాశం లేనట్టే. సెప్టెంబర్ లో ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ప్రమోషన్ కు టైం అవసరం కావడంతో హడావిడి పడకుండా థియేటర్లు నార్మల్ అయినప్పుడు మాత్రమే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలిసింది. మణిశర్మ స్వరపరిచిన రెండో సింగిల్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. మొత్తం అయిదు పాటల ఆల్బమ్ బయటికి రావడానికే ఇంకో నెల పట్టేలా ఉంది. ఇక సినిమా సంగతి వేరే చెప్పాలా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp