ధనుష్ స్టైల్ లో రామ్ చరణ్

By Ravindra Siraj Jan. 13, 2020, 11:59 am IST
ధనుష్ స్టైల్ లో రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే కోకాపేటలో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇంట్రో సాంగ్ ని షూట్ చేస్తున్నట్టుగా సమాచారం. మణిశర్మ ఇప్పటికే 3 పాటలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాలన్స్ 2 ఈ నెలలోనే రికార్డింగ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ఓ కీలకమైన పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నాడనే టాక్ చాలా రోజుల నుంచి ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు అది నిజమేనట. ఇందుకుగాను ఓ నెలన్నర పాటు డేట్స్ కూడా చరణ్ ఇచ్చినట్టుగ చెబుతున్నారు. 

అధికారిక ప్రకటనకు టైం పట్టొచ్చు. అయితే మగధీర తరహాలో తండ్రి కొడుకులను ఒకే ఫ్రేమ్ లో చూసి ఛాన్స్ అయితే లేకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే చరణ్ కనిపించేది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చిరంజీవి కుర్రపాత్రలో కాబట్టి. ఇది ఒకరకంగా ప్రయోగం అనిపించినా దీన్ని ఇదివరకే మొదట ధనుష్ ఆ తర్వాత మంచు విష్ణు చేశారు. తమిళ్ లో రూపొందిన రాజా పాండి సినిమాలో టైటిల్ రోల్ రాజ్ కిరణ్ పోషించగా అతని గతం తాలూకు ఎపిసోడ్స్ లో ధనుష్ నటించాడు. దీనికి దర్శకుడు నిర్మాత ధనుషే. 

ఆ తర్వాత గాయత్రిలో ఇదే తరహాలో మోహన్ బాబు ఫ్లాష్ బ్యాక్ లో మంచు విష్ణు అతని యంగ్ లుక్ లో కనిపిస్తాడు. ఇప్పడు రామ్ చరణ్ అదే తరహాలో చిరంజీవికి బదులు ఓ ఇరవై నిముషాలు అలా తెరపై మెరుస్తాడన్న మాట. ఇది మెగా ఫాన్స్ కిక్ ఇచ్చే న్యూస్ అయినా ఒకేసారి ఇద్దరిని చూడాలన్న కోరిక మాత్రం నెరవేరదు. హీరోయిన్ గా త్రిష నటించబోతున్నట్టు టాక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఆగష్టు 14 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని దానికి తగ్గట్టుగానే 4 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్లానింగ్ జరిగిపోయిందని యూనిట్ మాట .


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp