రామ్ చరణ్ మొదటి ఛాయస్ ఏది

By iDream Post Sep. 22, 2020, 01:13 pm IST
రామ్ చరణ్ మొదటి ఛాయస్ ఏది

కెరీర్ లో మొట్టమొదటి సారి అందరు స్టార్ హీరోలతో పాటు ఆరు నెలల లాంగ్ బ్రేక్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో షూటింగ్ స్పాట్ లో అడుగు పెట్టబోతున్నాడు. అది ఏ సినిమా అనే క్లారిటీ అభిమానులకే కాదు మీడియాకు సైతం లేదు. తాజా సమాచారం మేరకు అక్టోబర్ నుంచి రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అలియా భట్ కూడా తాను వచ్చే రెండు నెలలు ఖాళీగా ఉన్నానని, అడిగితే హైదరాబాద్ కు రావడానికి సిద్ధమని కబురు పంపిందట. డిసెంబర్ నుంచి మరో మల్టీ స్టారర్ బ్రహ్మాస్త్రలో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి ఆ తర్వాత అడిగినా లాభం లేదనే రీతిలో మెసేజ్ చేసినట్టు వినికిడి.

అదే నిజమైతే ముందుగా తనతో పాటు రామ్ చరణ్ కాంబోలో తీయాల్సిన సన్నివేశాలు, పాటలు పూర్తి చేయాలి. ఆ తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ ని పిలవాల్సి ఉంటుంది. అలా అయితే అక్టోబర్ లోనే ఆచార్య ప్లాన్ చేసుకున్న కొరటాల శివ చరణ్ ఎపిసోడ్ కాకుండా మిగిలిన భాగాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ ఫినిష్ చేసి రామ్ చరణ్ ఇటు వచ్చాక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని మొదలుపెట్టుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫైనల్ కాలేదు కానీ ఆచార్య 2021 వేసవికి విడుదల చేయాలనే సంకల్పంతో ఉంది కొణిదెల టీమ్. ఈ లెక్కన చూస్తే రామ్ చరణ్ వచ్చే మూడు నాలుగు నెలలు యమా బిజీగా ఉండటం ఖాయం. ఇప్పటికే యాభై శాతం పైగా ఆగిపోయిన సినిమాల షూటింగులు హైదరాబాద్ లోనే ప్రారంభమయ్యాయి. స్టార్ హీరోలు తప్ప అందరూ స్పాట్లలోనే ఉన్నారు.

మునుపటితో పోలిస్తే కరోనా తెలంగాణలో తగ్గుముఖం పట్టింది కానీ పరిస్థితిలో తీవ్రత పూర్తిగా సద్దుమణగలేదు. అందుకే ఇంకా బడా నిర్మాతలు ఎవరూ తమ షెడ్యూల్స్ ని మొదలుపెట్టలేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఖచ్చితమైన డేట్లు చెప్పడం లేదు. ఒక్క నాగార్జున మాత్రమే బిగ్ బాస్ 4, వైల్డ్ డాగ్ రెండు షూటింగులతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఏది ఎలా ఉన్నా వచ్చే నెల నుంచి స్టూడియోలు, అవుట్ డోర్ లొకేషన్లు యమా సందడిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్, ఆచార్యలు ఇంచుమించు ఒకేటైంలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రాజమౌళి అడిగే డేట్స్ ని బట్టే రామ్ చరణ్ ఆచార్యకు మిగిలినవి కేటాయించాల్సి ఉంటుంది. ఎలా చూసిన చెర్రీ ఫస్ట్ ప్రయారిటీ ఆర్ఆర్ఆర్ కే ముందు ఉంటుంది. నెక్స్ట్ ఆచార్యనే. వీటి తర్వాత తను ఏ సినిమా చేస్తాడనే భేతాళ ప్రశ్న మాత్రం ఇంకా అలాగే మిగిలిపోయింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp