అందనంత ఎత్తులో ప్రేమపక్షులు 'రాధే శ్యామ్'

By iDream Post Oct. 23, 2020, 12:24 pm IST
అందనంత ఎత్తులో ప్రేమపక్షులు 'రాధే శ్యామ్'

ఇవాళ డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ టీమ్ ముందు చెప్పినట్టే బీట్స్ పేరుతో ఓ చిన్న వీడియోని విడుదల చేసింది. ఇది టీజర్ కాదు. కేవలం మోషన్ పోస్టర్. ఏదీ రివీల్ చేయకుండా కళాత్మకంగా కట్ చేసిన ఈ పెయింటింగ్ లాంటి విజువల్ ఆకట్టుకునేలా ఉంది. అరచేయిని చూపించి అందులో గడ్డి మొలిపించి అలా లోతుగా తీసుకెళ్లి ఎత్తైన కొండ పర్వతాలు, వాటి మధ్య ఉన్న బ్రిడ్జ్ పై వెళ్తున్న పురాతన కాలం నాటి ఓ ట్రైన్, అందులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బయటికి వచ్చిన ప్రేరణ(పూజా హెగ్డే), వెనుక లోయను లెక్క చేయకుండా తన స్పర్శను ఆస్వాదిస్తున్న విక్రమాదిత్య(ప్రభాస్)ఇలా కొత్తగా ట్రై చేశారు. గ్రాఫిక్స్ మిక్స్ చేసినప్పటికీ సహజమైన ప్రకృతి అందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

వీడియో ప్రారంభంలో రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పార్వతిలను కార్టూన్లలో చూపించి వాళ్ళ సరసన నిలిచే ప్రేమకథగా రాధే శ్యామ్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసిన తీరు బాగుంది. ఈ లెక్కన ఇదో గ్రాండియర్ లవ్ స్టోరీ అనే క్లారిటీ అయితే వచ్చేసింది. సాహో తరహాలో కంప్లీట్ యాక్షన్ మూవీ కాదు. చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ ని ఇలా రొమాంటిక్ స్టోరీలో చూడటం కన్నా అభిమానులకు కిక్ ఇచ్చేది ఏముంటుంది. ఇటలీ బ్యాక్ డ్రాప్ నే పోస్టర్స్, ప్రమోషన్ మెటీరియల్స్ లో ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి స్టోరీ మొత్తం అక్కడే కొనసాగేలా కనిపిస్తోంది.

ఇక సంగీత దర్శకుడి సస్పెన్స్ కు అఫీషియల్ గా చెక్ పెట్టేశారు. మొన్న చెప్పినట్టుగా జస్టిన్ ప్రభారకన్ ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడీ వీడియోకు ఇచ్చిన ఓ చిన్న కీర్తనతో కూడిన బిజిఎం మెలోడీయస్ గా కంపోజ్ చేశారు. ఎక్కడ బాలీవుడ్ బ్యాచ్ ని తీసుకొచ్చి సాహో టైపులో ఖంగాళీ చేస్తారేమో అని భయపడిన ఫ్యాన్స్ కు ఇదొక ఊరట. కృష్ణంరాజు, యువి సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న రాధే శ్యామ్ లో ప్రభాస్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ బాగా పండినట్టు కనిపిస్తోంది. చాలా నీట్ గా ఇద్దరినీ దర్శకుడు రాధాకృష్ణ చూపించిన తీరుని మెచ్చుకోవచ్చు. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం కూడా ఉన్నత స్థాయిలో ఉంది. మొత్తానికి తమ హీరో పుట్టినరోజుకు ఓ చక్కని గిఫ్ట్ ఇచ్చింది రాధే శ్యామ్ టీమ్

Motion Poster Link @ bit.ly/34kOTtN

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp