`సూప‌ర్‌మ‌చ్చి`లో క‌న్న‌డ బ్యూటీ ర‌చితారామ్‌

By Press Note 15-11-2019 06:10 PM
`సూప‌ర్‌మ‌చ్చి`లో  క‌న్న‌డ బ్యూటీ ర‌చితారామ్‌

క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ నిర్మాత‌గా పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `సూప‌ర్‌మ‌చ్చి`. ఇటీవ‌ల ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయ‌డంతో పాటు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను న‌వంబ‌ర్ 22 నుండి ప్రారంభించ‌బోతున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
క‌ల్యాణ్‌దేవ్‌, ర‌చితా రామ్‌, నరేశ్ వి.కె, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, అజ‌య్‌, మ‌హేశ్‌, ష‌రీఫ్‌, స‌త్య త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: పులి వాసు
నిర్మాత‌: రిజ్వాన్‌
కో ప్రొడ్యూస‌ర్‌: ఖుషి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: మ‌నోజ్ మావెళ్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్
కెమెరా: శ్యామ్ కె.నాయుడు
ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
ఆర్ట్‌: బ్ర‌హ్మ క‌డ‌లి
పాట‌లు: కెకె

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.