క్వీన్ VS తలైవి - భలే పోటీ

By Ravindra Siraj Jan. 17, 2020, 10:22 am IST
క్వీన్ VS తలైవి - భలే పోటీ
ప్రస్తుతం అన్ని భాషల్లోనూ రాజ్యమేలుతున్న బయోపిక్ ల ట్రెండ్ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత మీద తీస్తున్న తలైవి సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఎంఎక్స్ ప్లేయర్ సంస్థ క్వీన్ పేరుతో రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో ఒక వెబ్ సిరీస్ ని రిలీజ్ చేసింది . అన్ని వాస్తవాలు చూపించారా లేదా అనేది పక్కన పెడితే టేకింగ్ పరంగానూ ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ పరంగానూ దీనికి ఫీడ్ బ్యాక్ బాగా వచ్చింది. 

అందులోనూ రెగ్యులర్ డిజిటల్ స్ట్రీమింగ్ సైట్స్ తరహాలో కాకుండా యాప్ ఇన్స్ టాల్ చేసుకున్న ప్రతిఒక్కరు ఉచితంగా చూసే వెసులుబాటు ఇవ్వడంతో ఎక్కువ జనానికి రీచ్ అయిపోయింది. ముఖ్యంగా రమ్యకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. అయితే సీజన్ వన్ లో రాజకీయ జీవితాన్ని పూర్తిగా చూపించలేదు. అసలైన కంటెంట్ సీజన్ టూలో ఉంటుందట. అందుకే దాని మీద ఆసక్తి పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న తలైవి అంచనాలు అందుకోవడానికి పెద్ద కసరత్తే చేయాలి. ఇవాళ ఎంజిఆర్ గా నటిస్తున్న అరవింద్ స్వామి లుక్ రిలీజ్ చేశారు. మేకప్ మహత్యమో ఏమో కానీ గెడ్డం మీసాలు లేకుండా అచ్చుగుద్దినట్టు అరవింద్ స్వామి ఎంజిఆర్ గా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాడు. కొద్దిరోజుల క్రితం వదిలిన కంగనా రౌనత్ లుక్ మీదే చాలా నెగటీవ్ కామెంట్స్ వచ్చాయి. కంగనా జయలలితగా సూట్ అవ్వలేదని సోషల్ మీడియాలో ఫీడ్ బ్యాక్ వచ్చింది. 

ఏదైతేనేం క్వీన్ ని తలదన్నేలా ఇప్పుడీ తలైవి ఉంటేనే జనం  థియేటర్లకు వస్తారు. లేదా ఫ్రీగా స్మార్ట్ ఫోన్ లోనో లేదా టీవీలో క్వీన్ వెబ్ సిరీస్ చూస్తారు. తలైవికి ఏఎల్ విజయ్ దర్శకుడు. కరుణానిధిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. జూన్ లో విడుదల కాబోతున్న తలైవి మీద క్వీన్ విసిరిన ఛాలెంజ్ గట్టిగానే ఉంది. ఏ మేరకు అంచనాలు అందుకుంటారో వేచి చూడాలి మరి.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp