మొదటిసారి సీక్వెల్ లో అల్లు అర్జున్

By iDream Post May. 06, 2021, 12:30 pm IST
మొదటిసారి సీక్వెల్ లో అల్లు అర్జున్
మొన్నటిదాకా గాసిప్ గా నిలిచిన వార్త నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ఫారెస్ట్ థ్రిల్లర్ పుష్ప రెండు భాగాలుగా రావడం ఖాయమేనని ఫిలిం నగర్ టాక్. దానికి తగ్గట్టే స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేసి షూటింగ్ స్పాన్ ని మార్చరట. కథ చాలా పెద్దగా ఉండటంతో పాటు డీటెయిల్డ్ గా చెబితేనే అందులోని సోల్ ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పగలమని భావించిన సుక్కు ఆలోచనను బన్నీ సపోర్ట్ చేయడంతో ఇది ఆల్మోస్ట్ లాక్ అయినట్టు వినికిడి. ఫహద్ ఫాజిల్ తోడయ్యాక రేంజ్ ఎలాగూ పెరిగింది కాబట్టి బిజినెస్ కూడా రెండుసార్లు చేసుకోవచ్చు.

ఇదే నిజమైతే అల్లు అర్జున్ మొదటిసారి కథ ప్రకారం కొనసాగింపు సీక్వెల్ లో నటించినట్టు అవుతుంది. అసలే టాలీవుడ్ కు ఈ విషయంలో నెగటివ్ సెంటిమెంట్ బలంగా ఉంది. ఒక్క బాహుబలి తప్ప ఇప్పటిదాకా తీసిన కొనసాగింపులేవి అంతగా విజయం సాధించలేదు. కానీ పుష్ప అలా కాదట. మొదటి భాగాన్ని ఉత్కంఠగా ముగించి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేలా సుకుమార్ స్క్రీన్ ప్లేని  సెట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఎలాగూ ఆగస్ట్ 13 విడుదల సాధ్యమయ్యేలా లేదు కాబట్టి కొత్త డేట్ ని ఫిక్స్ చేశాక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బన్నీ హోమ్ ఐసోలేషన్ లో ఉండటంతో ఏ అప్డేట్ బయటికి రావడం లేదు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్పకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లర్  గా బన్నీ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నాడు. స్లాంగ్ కూడా చిత్తూరు నేపథ్యంలో ఉంటుంది. దసరా లేదా దీపావళికి ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చేసి వచ్చే ఏడాది వేసవిలో సీక్వెల్ విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సాగుతోందట. దీని తర్వాత బన్నీ ఏ దర్శకుడితో చేయబోతున్నాడనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. కొరటాల శివతో ప్రాజెక్ట్ వాయిదా పడటంతో నెక్స్ట్ మురుగదాసా లేక ప్రశాంత్ నీలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి సస్పెన్సే.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp