పూరి పాన్ఇండియా డ్రీం ప్రాజెక్ట్

By iDream Post Jun. 23, 2020, 02:20 pm IST
పూరి పాన్ఇండియా డ్రీం ప్రాజెక్ట్

ఎప్పటి నుంచో పూరి జగన్నాధ్ ఊరిస్తున్న సినిమా జనగణమన. మహేష్ బాబు హీరోగా చేయాలని గట్టి ప్రయత్నమే చేశాడు కాని ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ పాన్ ఇండియా లెవెల్ లో దీన్ని ఎప్పటికైనా తీస్తానని చెప్పడంతో మరోసారి ఇది వార్తల్లోకి వచ్చింది. నిజానికి పోకిరి లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్, బిజినెస్ మెన్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన పూరితో హ్యాట్రిక్ మూవీగా ఇది తీస్తాడని అభిమానులు కూడా ఆశించారు. కాని ఎందుకో మరో ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ కుదరలేదు. ఒకదశలో పూరి వరస పరజయాలతో ఫ్లాప్ ట్రాక్ లో ఉండటం, స్టార్ హీరోలు అంతగా ఆసక్తి చూపకపోవడంలాంటివి కారణాలుగా చెప్పుకోవచ్చు.

కాని ఇస్మార్ట్ శంకర్ తో పూరి మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. రామ్ లాంటి లవర్ బాయ్ ని ఊర మాస్ గా చూపడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. అందుకే మళ్ళీ పెద్ద హీరోలు పిలుస్తారన్న నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. ఇదంతా ఓకే కాని జనగణమన ముందు నుంచి అనుకున్నట్టు మహేష్ తోనే తీస్తాడా లేక ఇంకో హీరోకి షిఫ్ట్ అవుతాడా అనేది వేచి చూడాలి. భారీ బడ్జెట్ తో దేశభక్తి ప్రధానాంశంగా దీన్ని తీస్తానని అప్పట్లో పలు ఇంటర్వ్యూలలో పూరి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ అంటే ఎంత లేదన్నా రెండు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టాలి. పైగా అప్పటికి ఇప్పటికీ ఖర్చు విషయంలో చాలా తేడాలు వచ్చాయి.

మరి వాటిని తట్టుకుని అంత మార్కెట్ చేయాలంటే పెద్ద స్టారే కావాలి. అయితే దీనికి చాలా టైం పట్టేలా ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న పూరి దాని షూటింగ్ ని వచ్చే నెల నుంచి రీ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ముంబైలో షూట్ చేయాల్సిన కీలకమైన ఎపిసోడ్స్ ఇంకా కొన్ని ఉన్నాయట. కాని అక్కడ కోరోనా విశ్వరూపం కొనసాగుతుండటంతో యూనిట్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఒకవేళ అక్కడ పరిస్థితి సద్దుమణగకపోతే హైదరాబాద్ లోనే కంటిన్యూ చేసే ఆలోచన ఉందట. అయితే ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ స్టార్లు ఎవరూ ఇంకా సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు సాహసం చేయడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ట్రయిల్ షూట్ చేశాడని న్యూస్ వచ్చింది కాని అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ప[పూరినే దీనికి శ్రీకారం చుడతాడా.చూద్దాం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp