స్పీడుమీదున్న పవర్ స్టార్ - పవన్ 27

By Ravindra Siraj Jan. 21, 2020, 06:04 pm IST
స్పీడుమీదున్న పవర్ స్టార్ - పవన్ 27

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ కోసం నిన్న సెట్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ ని చూసిన అభిమానుల ఆనందం మాములుగా లేదు. సోషల్ మీడియాలో వాటి తాలూకు లీక్డ్ పిక్స్ ని విపరీతంగా షేర్ చేసుకుని అప్పుడే రిలీజ్ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగానే పవన్ రెండో సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అది కూడా ఈ వారమే అంటే 27న షూటింగ్ ప్రారంభించుకోనుంది.

క్రిష్ దర్శకత్వం వహించే ఈ చిత్రం ఫాంటసీ పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుందని ఇన్ సైడ్ టాక్. నిర్మాత ఏఎం రత్నం. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఖుషి. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టి పవర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం తీసింది ఈయనే. ఆ తర్వాత అదే జోష్ లో బంగారం అనే ఊర మాస్ సినిమా తీశారు కానీ దాని ఫలితం మాత్రం నిరాశపరిచింది. ఇప్పుడీ కాంబోలో చిత్రమంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి.

క్రిష్ కూడా ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న కసిమీదున్నాడు. గత ఏడాది ఎన్టీఆర్ రెండు భాగాలూ దారుణంగా ఫెయిల్ అయ్యాయి. వాటి తాలూకు గాయం మానాలి అంటే పవన్ తో చేసే సినిమాని ఓ రేంజ్ లో తెరకెక్కించాలి . విశేషం ఏంటంటే దీనికి సంభాషణలు సాయి మాధవ్ బుర్ర సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ఈయన కలంలోనే రూపుదిద్దుకుంది. ఇప్పుడు పవన్ - క్రిష్ - సాయి మాధవ్ అంటే హైప్ ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను ఏకకాలంలో తెరకెక్కించడం చూస్తుంటే ఈ స్పీడ్ ఇలాగే కొనసాగాలని కోరుతున్నారు అభిమానులు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp