పవన్ హీరొయిన్ విలన్ గా చేస్తుందా ?

By iDream Post Apr. 12, 2020, 11:00 am IST
పవన్ హీరొయిన్ విలన్ గా చేస్తుందా ?

బోయపాటి శీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. పరిస్థితి సద్దుమణగగానే తిరిగి మొదలుపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు దీని తాలూకు ఒక వార్త అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో విలన్ గా భూమిక చావ్లా నటించబోతుదన్నది దాన్ని సారాంశం. యూనిట్ నుంచి అధికారికంగా తెలియనప్పటికీ దాదాపు ఖరారు అయినట్టేనని సమాచారం. భూమికా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఖుషి. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ ఇండస్ట్రీ హిట్ ద్వారా అప్పట్లో భూమిక యూత్ కు హాట్ త్రొబ్ గా మారిపోయింది.

పవన్ తో పోటాపోటీగా చేసిన నటన చాలా ఆఫర్స్ ని మోసుకొచ్చింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి, మహేష్ బాబు ఒక్కడు భూమిక రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఆ టైంలో అందరు స్టార్ హీరోల సరసన నటించిన భూమిక ఓ రేంజ్ లో ఫామ్ ని ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మధ్యలో అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది కానీ బ్రేక్ తీసుకుంది. నాని ఎంసిఎతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కం బ్యాక్ ఇచ్చిన భూమిక ఆ తర్వాత సమంతా యుటర్న్, నాగ చైతన్య సవ్యసాచి, బాలకృష్ణ రూలర్ లో చేసిన భూమికకు అవేవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇక విషయానికి వస్తే బాలయ్య సినిమాలో నరసింహలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి రేంజ్ పాత్ర ఒకటుందట.

దాన్ని భూమికతో చేయించాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సారాంశం. కానీ సాఫ్ట్ లుక్స్ తో ఉండే భూమిక ఆ పాత్రకు ఎంత వరకు సరిపోగలదు అనే దాని మీద అనుమానాలు లేకపోలేదు. కానీ బాలకృష్ణ స్వయంగా రికమండ్ చేయడంతో బోయపాటి ఆప్షన్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. అఫీషియల్ గా ప్రకటించే దాకా చెప్పలేం కానీ ఒకవేళ నిజమైతే భూమికకు ఇది పెద్ద బ్రేక్ అవుతుంది. అసలే మార్కెట్ బాగా డల్ గా ఉన్న సిచువేషన్ లో బాలయ్యకు ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన టార్గెట్ తో బోయపాటితో చేస్తున్నాడు. కరోనా వాయిదా లేకపోతే ఈ ఏడాదే రిలీజ్ ఉండేది కానీ ఇప్పుడైతే డౌటే. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వినికిడి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp