పవన్ 27 సెట్స్ లీక్ : పీరియాడిక్ డ్రామానే

By iDream Post Mar. 10, 2020, 10:40 am IST
పవన్ 27 సెట్స్ లీక్ : పీరియాడిక్ డ్రామానే

ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంచలనం రేపిన పవన్ కళ్యాణ్ వాటి మేకింగ్ లోనూ వేగం ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలు, శృతి హాసన్ పాల్గొనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా మొత్తం పూర్తయ్యింది. పంచాయితీ ఎలక్షన్స్ నేపథ్యంలో పవన్ షూట్ కు బ్రేక్ ఇస్తాడనే వార్తల నేపథ్యంలో దిల్ రాజు కొత్త డేట్ ని ప్రకటించే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం మొదలైంది.

ఇదిలా ఉండగా తన 27వ సినిమాని క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న విషయం విదితమే. ఇప్పుడు హైదరాబాద్ లో దీన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు యమా స్పీడ్ గా సాగుతున్నాయి. ఎన్నో దశాబ్దాల క్రితం స్వతంత్రం రాకమునుపు కాలాన్ని పునఃసృష్టి చేసేలా వేసిన సెట్టింగులు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదో పీరియాడికల్ డ్రామా అని తెలంగాణ పోరాట యోధుడు పండగ సాయన్న కథను ఆధారంగా చేసుకుని రూపొందుతోందని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ యూనిట్ అధికారికంగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడీ సెట్ తాలూకు ఫోటోలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. లీకుల రూపంలో ఇవి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న కథలను తాను అద్భుతంగా డీల్ చేయగలనని గౌతమిపుత్ర శాతకర్ణితో రుజువు చేసుకున్న క్రిష్ ఇప్పుడు పవన్ తో అంతకుమించి అనే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ వల్ల డ్యామేజ్ అయిన ఇమేజ్ ని దీంతో పూర్తిగా రాబట్టుకోవాలనే ఆలోచనతో సాయి మాధవ్ బుర్రతో కలిసి స్క్రిప్ట్ ని పకడ్బందీగా రూపొందించినట్టు తెలిసింది. పురాతన కోటలు, అప్పటి సంస్కృతిని ప్రతిబింబించే డ్రమ్ములు, ఆయుధాలు తదితర సరంజామా చూస్తుంటే పవన్ ఇప్పటిదాకా చేయని పాత్రని మాత్రం ఖరారైపోయింది. మేకింగ్ పరంగా సైరా, రుద్రమదేవి, మణికర్ణిక లాంటి సినిమాల పోలికలు కనిపిస్తున్నప్పటికీ కథ పరంగా చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ఈసారి పవర్ స్టార్ అభిమానులు ఆశించే దాని కన్నా ఎక్కువే ఈ సినిమాతో లభించేలా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp