గ్రాండ్ గా రాజమండ్రిలో ప్రతిరోజు పండగే విజయోత్సవం

By Press Note Dec. 26, 2019, 09:03 am IST
గ్రాండ్ గా రాజమండ్రిలో ప్రతిరోజు పండగే విజయోత్సవం

సాయి తేజ్ మరో డిఫరెంట్ హిట్ అందుకున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన "ప్రతి రోజు పండగే" సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న చిత్ర యూనిట్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇక బుధవారం చిత్ర యూనిట్ రాజమండ్రిలో విజయోత్సవ సభను నిర్వహించి సక్సెస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ సందర్భంగా...

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ... రాజమండ్రిలోనే ఈ ఈవెంట్ ని నిర్వహిస్తామని అనుకోలేదు. ఎక్కువ భాగం షూటింగ్ ఇక్కడే జరిగింది. అయితే ఇక్కడే ఈవెంట్ ని నిర్వహించాలని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారు. మొదట్లో ఈ సక్సెస్ మీట్ సక్సెస్ అవుతుందో లేదో అని భయపడ్డాను. కానీ మన రాజమండ్రి వారే దాన్ని సక్సెస్ అయ్యారు. తేజు అంటే నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి తేజు అంటే ఇష్టం. అలాంటి పర్సన్ కి ఇంతటి మంచి విజయాన్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ...ఈ సినిమా కథ రాసుకున్నపుడే రాజమండ్రిలో షూట్ చేయాలని అనుకున్నాను. అప్పుడే సక్సెస్ మీట్ ని కూడా ఇక్కడే చేయాలనీ అనుకున్నాను. పేరెంట్స్ ని మిస్ అవుతున్న ప్రతి ఒక్కరికి కాన్సెక్ట్ అయ్యేలా సినిమా చేయాలనే ఆలోచన మొదట సాయి తేజ్ లో పుట్టింది. కథను డెవలప్ చేయగానే అల్లు అరవింద్ గారు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాలని అనుకున్నా. ఎవరు మిస్ అవ్వకుండా ఈ సినిమాను చూస్తారని భావించాను. ఇలాంటి సక్సెస్ లతో ఇంకా మరిన్ని మంచి సినిమాలు తీసేలా బలాన్ని చేకూరుస్తాయి. ఈవెంట్ కి వచ్చిన నటీనటులకు అలాగే ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు' అని మారుతి వివరణ ఇచ్చారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... ఈ విజయం ఇద్దరిదని చెప్పాలి. మారుతి - సాయి తేజ్ ఇద్దరు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అందరికంటే ఎక్కువగా ఈ విజయం వారికే దక్కుతుందన్నారు. సినిమా చూసి ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తమన్ సంగీతం, మారుతి దర్శకత్వం, సాయి తేజ్ నటన ఇలా అన్ని ఈ సినిమాకు కాలిసొచ్చాయి. సినిమా సక్సెస్ అయిన సందర్బంగా మరిసారి చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ...ప్రతిరోజు పండగే సినిమా నా కెరీర్ లొనే ఇంపార్టెంట్, ఇలాంటి సమయంలో నా దగ్గరికి ఒక మంచి కథను తీసుకొని వచ్చిన మారుతి గారికి థాంక్స్. మా సినిమాకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. థియేటర్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సత్యరాజ్ గారు చేసిన రోల్ మర్చిపోలేను. రావు రమేష్ గారితో నేను చేసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. తమన్ నా కాంబినేషన్ లో వచ్చిన మంచి సినిమా ఇది. మా సినిమాను సపోర్ట్ చేసున్న అందరికి ధన్యవాదాలు, ఈ సక్సెస్ ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం చేస్తున్న అన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp