సీన్ వదిలేసి షాపింగ్ వెళ్ళిన అనుష్క

By iDream Post Apr. 05, 2020, 05:14 pm IST
సీన్ వదిలేసి షాపింగ్ వెళ్ళిన అనుష్క

ఇటీవలే 15 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అనుష్కను అభిమానులు స్వీటీ అని ముద్దుగా పిలుచుకునే సంగతి తెలిసిందే. ఇంత కాలం ఒక హీరొయిన్ ప్రస్థానాన్ని కొనసాగించడం అంత ఈజీ కాదు. అందులోనూ హీరోల మార్కెట్ తో సమానంగా తన పేరు మీదే నిర్మాతలకు లాభం వచ్చేలా చేయడం తనకు మాత్రమే సాధ్యమని చెప్పొచ్చు. అరుంధతి, భాగమతి సక్సెస్ వెనుక కథానాయకుడు ఉండడు. అనుష్కనే కనిపిస్తుంది. అంతలా ప్రభావం చూపించింది కాబట్టి ప్రభాస్ లాంటి మ్యాచో మ్యాన్ ఉన్నప్పటికీ బాహుబలిలో దేవసేనగా తన ఉనికిని బలంగా చాటుకుంది.

అయితే సినిమాల వరకే కాదు అనుష్క నిజ జీవితంలోనూ తనది పెద్ద మనసు అని రుజువు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక ఉదాహరణ చూద్దాం. భాగమతి షూటింగ్ టైంలో సరూర్ నగర్ లో ఉన్న అనాధ పిల్లల ఆశ్రమంలో యూనిట్ మొత్తం రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నారు. ఏసిపిగా నటిస్తున్న మురళిశర్మ, కానిస్టేబుల్ గా చేస్తున్న ప్రభాస్ శీనుతో పాటు మరికొందరు సభ్యులతో సీన్స్ చేస్తున్నారు. జైలు యునిఫార్మ్ లో ఉన్న అనుష్క ఉన్నట్టుండి అక్కడి నుంచి మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళిందా అని ఆరా తీస్తే షాపింగ్ కోసం వెళ్లిందని తెలిసింది. ఈ టైంలో మాల్ కు వెళ్ళడం అవసరమా అని అనుకున్న వాళ్ళు లేకపోలేదు. మరుసటి రోజు దసరా పండగ. సెలవులు ఇచ్చేశారు.

ఈ రాత్రి గడిస్తే మరుసటి రోజు షూట్ కుదరదు. కాసేపటి తర్వాత పెద్ద బాస్కెట్ తో అనుష్క వచ్చేసింది. దాన్నిండా పిల్లలకు కావాల్సిన చాకలెట్స్, బిస్కెట్స్, బ్రష్షులు, సబ్బులు, పేస్టులు, ఆటబొమ్మలు అన్ని ఉన్నాయి. త్వరగా వాటిని అందరికి పంచేయమని చెప్పి మేకప్ తో షాట్ కు రెడీ అయిపోయింది. దీంతో ఆశ్చర్యపోతూనే మిగిలిన టీం మెంబెర్స్ వాటిని పంచే పనిలో పడ్డారు. ఈ సంఘటన బయటికి ఎక్కువ హై లైట్ అవ్వలేదు. సాధారణంగా స్టార్లు షాట్ అవ్వగానే క్యారవన్ కు వెళ్ళిపోతారు. కాని అనుష్క మాత్రం లొకేషన్లోనే ఉంటూ యూనిట్ సభ్యులతో, మిగిలిన చిన్న యాక్టర్స్ తో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. ఇంత డీటెయిల్డ్ గా ఇవన్ని చెప్పింది ప్రభాస్ శీనునే. ఓ ఇంటర్వ్యూలో అనుష్కకు సంబంధించిన ఇలాంటి స్వీట్ న్యూస్ ని ఫ్యాన్స్ కోసం పంచుకున్నాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp