'సలార్'గా ప్రభాస్ : అఫీషియల్

By iDream Post Dec. 02, 2020, 06:28 pm IST
'సలార్'గా ప్రభాస్ : అఫీషియల్

డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు ఈ ఏడాది మరో స్వీట్ గిఫ్ట్ వచ్చేసింది. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న భారీ యాక్షన్ ప్రాజెక్టుని టైటిల్ తో సహా ప్రకటించేశారు. సలార్ గా సరికొత్త అవతారంలో ప్రభాస్ కనువిందు చేయబోతున్నాడు. దీని తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇందాక విడుదల చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మోస్ట్ వయోలెంట్ మెన్ అని క్యాప్షన్ పెట్టడం చూస్తే స్క్రీన్ మీద ప్రభాస్ క్యారెక్టర్ చేయబోయే రచ్చ మాములుగా ఉండేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2 ఫీనిషింగ్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ దీని స్క్రిప్ట్ పనులను కూడా ఇప్పటికే మొదలుపెట్టినట్టు ఇన్ సైడ్ టాక్. ఇతని డెబ్యూ మూవీ కన్నడలో వచ్చిన ఉగ్రం. అదే కథకు కొన్ని కీలకమైన మార్పులు చేసి సలార్ గా మార్చినట్టు ప్రచారం జరుగుతోంది కానీ అది ఎంత వరకు నిజమో సినిమా విడుదల అయ్యాకే క్లారిటీ వస్తుంది. అది కూడా ఔట్ అండ్ ఔట్ వయోలెంట్ మాస్ స్టోరీ కావడం గమనించాల్సిన అంశం. హీరోయిన్, ఇతర తారాగణం, టెక్నికల్ టీమ్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

దీంతో ప్రభాస్ చేయబోయే సినిమాల లిస్ట్ అమాంతం పెరిగిపోయింది. రాధే శ్యామ్ తర్వాత ఆది పురుష్ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. నాగ అశ్విన్ తో చేయాల్సిన భారీ విజువల్ వండర్ కూడా ప్లానింగ్ లో ఉంది. ఈ సలార్ వాటి కన్నా ముందు వస్తుందా లేక ఇంకో రెండేళ్ల తర్వాత ప్లాన్ చేశారా వేచి చూడాలి. కెజిఎఫ్ నిర్మాతలు హోంబాలే ఫిలిమ్స్ ఈ సలార్ ను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారు. బడ్జెట్ మరీ నాలుగైదు వందల కోట్లు ఉండొచ్చా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో సలార్ ప్రేక్షకులను పలకరించబోతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp