ప్రభాస్ కో కమర్షియల్ హిట్ కావాలి

By Ravindra Siraj Jan. 18, 2020, 01:59 pm IST
ప్రభాస్ కో కమర్షియల్ హిట్ కావాలి

బాహుబలి కోసం ఐదేళ్లు త్యాగం చేసిన డార్లింగ్ ప్రభాస్ ఆ తర్వాత సాహో కోసం మరో రెండేళ్లు ఖర్చు పెట్టేశాడు. మొదటిదానికి ఆశించిన దాని కన్నా ఎక్కువ ఫలితం దక్కింది కానీ రెండోది మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఏడేళ్ల కాలంలో కేవలం మూడు సినిమాలు అంటే స్టార్ హీరో అభిమానులు జీర్ణించుకునే విషయం కాదు. అందులోనూ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న కొత్త మూవీ కూడా భారీ బడ్జెట్ అనే మాట వినిపిస్తోంది కాబట్టి ఇదెంత లేట్ అవుతుందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

మిర్చి తర్వాత ప్రభాస్ ని సరైన మాస్ అవతారంలో ప్రేక్షకులు ఇంతవరకు చూడలేదు. బాహుబలి చరిత్ర సృష్టించినా అది ఫాంటసీ మూవీ. హీరోతో సమానంగా దర్శకుడు రాజమౌళి కూడా పేరు తెచ్చుకున్నాడు. కానీ సాహో అలా కాదు. అన్ని రకాలుగా దెబ్బ తీసింది. హిందీలో హిట్ అనిపించుకుంది కానీ సౌత్ లో మాత్రం కనీస అంచనాలు అందుకోలేదు. ఇవాళ అనౌన్స్ మెంట్ పేరుతో ఓ ఫోటోని రిలీజ్ చేశారు. ఈ నెల 20 నుంచి ఫన్ ట్రాక్ తో సాగే షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు అందులో ప్రభాస్ పేర్కొన్నాడు.

దీనికి వాస్తవంగా జాన్ అనే టైటిల్ ముందుగా అనుకున్నారు. తర్వాత ఏమైందో కానీ అది కాస్తా జానుగా మారి దిల్ రాజు తీస్తున్న 96 రీమేక్ కు వెళ్లిపోయింది. దీనికి కొత్త టైటిల్ వెతికే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. జిల్ తో డీసెంట్ హిట్ అందుకున్న రాధాకృష్ణకు దర్శకత్వం రూపంలో పెద్ద బాధ్యతే ఉంది. ప్రభాస్ కో గట్టి కమర్షియల్ హిట్ ఇవ్వడంతో పాటు తాను కూడా సెల్ఫ్ గా ప్రూవ్ చేసుకోవాలి. అందరికి లక్కీ గర్ల్ గా మారిన పూజా హెగ్డే హీరోయిన్ కావడం మరో ఆకర్షణ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp