2020 దసరాకి ప్రభాస్ 'జాన్'?

By Aravind.K Dec. 16, 2019, 02:42 pm IST
2020 దసరాకి ప్రభాస్ 'జాన్'?

'బాహుబలి' గా అందరి గుండెల్లో నిల్చిపోయిన మన డార్లింగ్ ప్రభాస్ ఈ సంవత్సరం 'సాహో' తో మన ముందుకొచ్చి ఘోరంగా నిరుత్సాహ పరిచాడు. కాని బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఇంకాస్త దగ్గరయ్యాడు. అందుకే కాబోలు తన తదుపరి చిత్రం కూడా పాన్ ఇండియా చిత్రంగా మల్చుకున్నాడు.

'జిల్' దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ నిర్మిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా, ప్రభాస్ హాలిడే ట్రిప్ వల్ల అది జనవరి నెలాఖరుకు వెళ్ళింది.

తన అభిమాన హీరో కొత్త చిత్రం వార్తల కోసం ప్రభాస్ అభిమానులు అసహనం ఇంక కొనసాగుతూనే ఉంది. సహోలా కాకుండా ఈ సినిమా అయిన సమయానికి పూర్తి చేసి 2020 దసరాకి మన ముందుకు తీసుకురావాలని చిత్రం యూనిట్ మరియు అభిమానులు కోరుకుంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp