నెవర్ బిఫోర్ స్టొరీలో ప్రభాస్

By iDream Post Apr. 12, 2020, 07:48 pm IST
నెవర్ బిఫోర్ స్టొరీలో ప్రభాస్

సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ డియర్/రాధే శ్యామ్ (ప్రచారంలో ఉన్న టైటిల్స్) మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా తాకిడి లేకపోయి ఉంటే ఈపాటికి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసే వాళ్ళు. అయినా రాజమౌళి అంతటి వారే ఆర్ఆర్ఆర్ వీడియో టీజర్లు రిలీజ్ చేయగా లేనిది మీరెందుకు సైలెంట్ గా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం బాగానే వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన లీకులు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

వాటి ప్రకారం ప్రభాస్ ఇందులో పామిస్ట్ గా డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. అది కూడా యూరప్ బ్యాక్ డ్రాప్ లో. తనను ప్రేమించిన అమ్మాయి(పూజా హెగ్డే) త్వరలో చనిపోతుందని తెలిసి ఆమెను ఆ ప్రమాదం నుంచి హీరో కాపాడతాడు. ఆ తర్వాత ప్రభాస్ కూ అలాంటి ముప్పే పొంచి ఉందని గుర్తించిన పూజాతో పాటు ఇద్దరూ కలిసి ప్రాణాలకు తెగించి ఆ గండం నుంచి బయటపడతారట. అయితే ఇదంతా నిజమా కదా అనేది తెలియదు కానీ మేకింగ్ లో మాత్రం దర్శకుడు రాధాకృష్ణ మణిరత్నం స్టైల్ ని ఫాలో అవుతూ ప్రభాస్ ని చాలా కొత్తగా చూపిస్తున్నాడట. గత కొద్దిరోజులుగా పూజా హెగ్డే సైతం వీలు దొరికినప్పుడంతా ఇది విజువల్ ట్రీట్ అని ఊహించని ఎమోషన్స్ చాలా ఉంటాయని చెబుతూ వస్తోంది. ఈ మాటలను పరిగణనలోకి తీసుకుంటే పైన చెప్పిన కాన్సెప్ట్ కి దగ్గరగా సింక్ అవుతోంది.

ఒకవేళ నిజమైతే మాత్రం ప్రభాస్ ని చాలా ఫ్రెష్ యాంగిల్ లో చూడొచ్చు. డార్లింగ్ లో గొప్ప ప్రేమికుడిగా చూసి చాలా రోజులయ్యింది. అప్పుడెప్పుడో వర్షం తర్వాత ఆ స్థాయి ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీ ప్రభాస్ చేయలేదు. మిర్చి, బాహుబలి, సాహో ఇవన్నీ ప్రేమ కథలు కాదు. అందుకే రాధాకృష్ణ మూవీ చాలా స్పెషల్ గా నిలుస్తుందని చెబుతున్నారు. షూటింగ్ హాల్ట్ అయ్యింది కాబట్టి విడుదల ఈ ఏడాదే ఉండొచ్చన్న నమ్మకం మెల్లగా సన్నగిల్లుతోంది. ఎంత భాగం పూర్తయ్యిందనే క్లారిటీ కూడా పూర్తిగా రావడం లేదు. అర్ధాంతరంగా ముగించుకు వచ్చిన జార్జియా షెడ్యూల్ ని తిరిగి యెక్క కొనసాగిస్తారన్న సమాచారం లేదు. మొత్తానికి కరోనా భారీ సినిమాల మీద చాలా రకాలుగా పెద్ద దెబ్బ వేసింది. ఎలాగూ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ ఎదురు చూపులు ఐదేళ్ల నుంచి అలవాటయ్యాయి కాబట్టి దీనికి కూడా అదే కొనసాగించడం తప్పదు మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp