విశ్వక్ సేన్ సినిమాకు రూటు క్లియర్ ?

By iDream Post May. 16, 2021, 12:00 pm IST
విశ్వక్ సేన్ సినిమాకు రూటు క్లియర్ ?
చుట్టూ ఏం జరుగుతోందో అంతు చిక్కడం లేదు. మళ్ళీ స్టార్ట్ యాక్షన్ కెమెరా అనే సౌండ్ ఎప్పుడు వినిపిస్తుందో ఎవరికి తెలియదు. మొన్న వకీల్ సాబ్ థియేటర్ల వద్ద సందడి మళ్ళీ ఎక్కడ కనిపిస్తుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుని విడుదల కోసం ఎదురు చూస్తున్న నిర్మాతల పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆర్థికంగా బ్యాకప్ ఉన్న ప్రొడ్యూసర్లు తట్టుకోగలుగుతున్నారు కానీ చిన్న మరియి మీడియం రేంజ్ వాళ్లకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. రాను రాను రోజులు ఇంకా సంక్లిష్టంగా మారే సూచనలు ఉండటంతో అగ్ర నిర్మాతలు సైతం ఓటిటి ఆలోచన చేయక తప్పేలా లేదు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం విశ్వక్ సేన్ కొత్త సినిమా పాగల్ డిజిటల్ రూట్ పట్టొచ్చనే వార్త గట్టిగానే షికారు చేస్తోంది. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ వాస్తవానికి ముందు ప్లాన్ చేసిన డేట్ మే 1. సరిగ్గా అప్పుడే లాక్ డౌన్ పీక్స్ కు వెళ్లిపోయింది. ఎప్పుడు నార్మల్ అవుతుందో అర్థం కానీ సిచువేషన్ లో నిర్మాత దిల్ రాజు ఓటిటి ఆప్షన్ గురించి సీరియస్ గానే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల ప్రాణాలు పిట్టల్లా గాలిలో కలిసిపోతున్నాయి. జనానికి ఎంటర్ టైన్మెంట్ మూడ్ పెద్దగా లేదు. థియేటర్లు తెరిచినా వస్తారన్న నమ్మకం అసలే లేదు.

అందుకే రిస్క్ లేకుండా పాగల్ ని ఇలా డైరెక్ట్ స్ట్రీమింగ్ కి ఇచ్చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన దిల్ రాజు వద్ద ఇప్పటికే రెండు మూడు సంస్థలు పెట్టాయని తెలిసింది. ప్రైమ్ లేదా ఆహా ఈ రెండింటి మధ్యే గట్టి పోటీ ఉందట. ఇప్పటిదాకా ఈయన అధిక శాతం సినిమాలన్నీ ప్రైమ్ లోనే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఉండొచ్చు. గత ఏడాది టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ ఓటిటి రిలీజ్ నాని వి నిర్మాత  కూడా దిల్ రాజే కావడంతో ఈ టాక్ కు ప్రాధాన్యం ఏర్పడింది. అందులోనూ విశ్వక్ సేన్ లాంటి హీరోల సినిమాలకు ఇప్పుడు ఈ దారే బెటర్. కంటెంట్ బాగుంటే భారీ వ్యూయర్ షిప్ తో పాటు రీచ్ కూడా పెరుగుతుంది. చూద్దాం
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp