టెన్షన్ పెడుతున్న ఫారిన్ షూటింగులు

By iDream Post Oct. 30, 2020, 06:19 pm IST
టెన్షన్ పెడుతున్న ఫారిన్ షూటింగులు

కరోనా తగ్గింది. జన జీవనం సాధారణం అయిపోయింది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.పరిశ్రమ వ్యవహారాలు కూడా మెల్లగా ఓ కొలిక్కి వస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు తప్ప స్టార్లందరూ ఇప్పటికే సెట్స్ లోకి అడుగు పెట్టేశారు. కొన్ని సినిమాలు విదేశీ షూటింగులకు ప్లానింగ్ లో చాలా బిజీగా ఉన్నాయి. అయితే ఇదంత తేలిక వ్యవహారంలా కనిపించడం లేదు. రాధే శ్యామ్ యూనిట్ ప్రస్తుతం ఇటలీలో ఉన్న సంగతి తెలిసిందే . అక్కడ మెల్లగా సెకండ్ వేవ్ మొదలుకావడంతో ఆంక్షలను కఠినం చేశారు. పాక్షిక లాక్ డౌన్ ని అమలు పరుస్తున్నారు. ఇది చాలా ఇబ్బంది పెడుతున్నప్పటికీ ప్రభాస్ టీం అన్నింటినీ భరించి వీలైనంత త్వరగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది.

ఇది తెలిసిన నితిన్ రంగ్ దే బృందం పునరాలోచనలో పడింది. వీళ్ళూ అక్కడికే వెళ్ళాల్సి ఉంది. డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా రెండో విడత ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపధ్యంలో లేనిపోని రిస్క్ చేస్తే అక్కడే ఇరుక్కుపోయే ప్రమాదం జరగోచ్చు. ఇప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే తన బెల్ బాటంని శరవేగంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. కాని భారీ బడ్జెట్ మూవీస్ కి ఇలా చేయడం సాధ్యపడదు. అందుకే వచ్చే జనవరి అయ్యాకే ఫారిన్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకునేలా నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది

మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా అమెరికా వెళ్ళాల్సి ఉంది. సుమారు నెలన్నర రోజుల సుదీర్ఘమైన షూట్ సెట్ చేసుకున్నారు. ఇప్పుడీ పరిస్థితుల దృష్ట్యా ప్రిన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. ఈ ఏడాది అయితే ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ లేదని ఇప్పటికే సమాచారం వచ్చేసింది. ఇకపై కథలు రాసే రచయితలు దర్శకులు కూడా తమ స్క్రిప్ట్ లో వీలైనంత ఫారిన్ లొకేషన్లు లేకుండా చూసుకుంటేనే బెటర్. లేకపోతే వాయిదాలతోనే పుణ్యకాలం గడిచిపోయేలా ఉంది. సెకండ్ వేవ్ ఇండియాకు వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు కానీ విపత్తులు అనేవి ఊహించినట్టు జరగవు కదా. వేచి చూడటం తప్ప ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp