నెలంతా డిజిటల్ పండగ

By iDream Post Apr. 03, 2021, 05:10 pm IST
నెలంతా డిజిటల్ పండగ
ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సూర్యుడి విలయతాండవం కొనసాగుతోంది. ఇలాంటి వాతావరణంలో ప్రేక్షకులు రిలీఫ్ అయ్యేది వినోదంతోనే. దానికి బెస్ట్ ఆప్షన్ సినిమాలే. అందుకే ఏ వ్యాపారాలు ఎలా ఉన్నా థియేటర్లు మాత్రం మంచి మూవీస్ ఉంటే చాలు హౌస్ ఫుల్ అయిపోతాయి. అయితే కరోనా పుణ్యమాని ఓటిటి కూడా ఇప్పుడు హాల్ తో సమానంగా పోటీ పడుతుండటంతో జనంలో డిజిటల్ రిలీజుల మీద కూడా విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. ఎప్పుడు ఏ కొత్త చిత్రం ఏ ఓటిటి యాప్ లో వస్తుందా అనే ఆసక్తితో క్రమం తప్పకుండ వాటి అప్ డేట్స్ ని ఫాలో అవుతున్నారు.

ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెల సబ్ స్క్రైబర్స్ కు మంచి కనువిందు చేయనుంది. ప్రస్తుతం ఎప్పుడెప్పుడు డిజిటల్ లో వస్తుందా అని పబ్లిక్ విపరీతంగా ఎదురు చూస్తున్న ఉప్పెన 12వ తేదీ నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నట్టు సమాచారం. ఇంకా కమింగ్ సూన్ క్యాటగిరీలో నెట్ ఫ్లిక్స్ అప్ డేట్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ డేట్ లాక్ అయినట్టు తెలిసింది. ఇక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జాతిరత్నాలు అమెజాన్ ప్రైమ్ లో 10వ తేదీకి షెడ్యూల్ చేసినట్టు టాక్. ఇదీ అఫీషియల్ గా చెప్పలేదు కానీ కేవలం రెండు మూడు రోజుల ముందు మాత్రమే అగ్రెసివ్ ప్రమోషన్ చేయబోతున్నారు. ప్రైమ్ చాలా సార్లు ఫాలో అయిన స్ట్రాటజీ ఇది.

ఇక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన చావు కబురు చల్లగా కూడా 14 లేదా 16న వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఆహా ద్వారా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇవి కాకుండా తమన్నా నటించిన 11త్ అవర్ థియేటర్లను స్కిప్ చేసి నేరుగా ఇదే యాప్ లో 12న రిలీజ్ కాబోతోంది. శ్రీకారం, ఏ1 ఎక్స్ ప్రెస్ లు కూడా ఏప్రిల్ లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రంగ్ దే తాలూకు ఇన్ఫో రావాల్సి ఉంది. అరణ్యను కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా ముందే వదిలే ఛాన్స్ లేకపోలేదు. ఇక మొన్న వచ్చిన వైల్డ్ డాగ్ నెట్ ఫ్లిక్స్ కి, సుల్తాన్ ని ఆహాకు ఇచ్చారు. మొత్తానికి ఇవన్నీ థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు రాబోయే రోజుల్లో నాన్ స్టాప్ విందు సిద్ధం కాబోతోంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp