జాగ్రత్త పడుతున్న ఓటిటిలు

By iDream Post Jun. 20, 2021, 02:00 pm IST
జాగ్రత్త పడుతున్న ఓటిటిలు

మూడు రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి రిలీజ్ అందుకున్న ధనుష్ జగమే తంత్రం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగటివ్ ఫీడ్ బ్యాక్ వెల్లువెత్తుతోంది. ఇంత పేలవమైన కథను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అంత కన్నా నీరసంగా తెరకెక్కించిన తీరు అభిమానులను సైతం మెప్పించలేకపోయింది. మొదటి రోజు భారీ వ్యూయర్ షిప్ అయితే దక్కింది కానీ అది క్రమంగా తగ్గుతూ పోతున్న మాట కూడా వాస్తవం. ఒకరకంగా చెప్పాలంటే ఓటిటి లో డైరెక్ట్ ప్రీమియర్ అయితే అది ఫ్లాప్ అన్న అభిప్రాయం జనంలో కలుగుతోంది. నిజానికి కంటెంట్ లేని సినిమాలనే నిర్మాతలు అమ్ముతున్నారన్న వాస్తవాన్ని ఇక్కడ మర్చిపోకూడదు.

ఇక విషయానికి వస్తే జగమే తంత్రం హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఇప్పటికే ఓటిటి వర్గాల్లో టాక్ ఉంది. పబ్లిసిటీ కూడా భారీగా చేశారు. లక్షలు ఖర్చు చేసి చాలా మీడియాల్లో ప్రకటనలు గుప్పించారు. ఇంతా చేస్తే ఇది మినిమమ్ యావరేజ్ కూడా అనిపించుకోలేదు. అసలు సినిమా చూడకుండానే డీల్ జరిగిందని హీరో దర్శకుడి కాంబినేషన్ మీదున్న క్రేజ్ తో పాటు మాఫియా డ్రామా అనే ట్యాగ్ సదరు సంస్థను ఆకర్షించిందని అదే ఇలా తప్పులో కాలేయడానికి కారణం అయ్యిందని అంటున్నారు. ఏదైతేనేం మొత్తానికి డిజాస్టర్ ముద్ర తప్పలేదు. దీని ప్రభావం ఇప్పుడు మరోలా ఉండబోతోంది.

థియేటర్లు తెరుచుకోబోతున్నప్పటికీ కొందరు నిర్మాతలు తమ సినిమాలు మంచి రేట్ వస్తే ఓటిటికి ఇచ్చేందుకే సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సంస్థలు ఫస్ట్ కాపీని చూశాకే డీల్ మాట్లాడుదామని అప్పటిదాకా రేట్ చెప్పే సమస్యే లేదని తెగేసి చెబుతున్నాయట. గత ఏడాది వి, నిశ్శబ్దం విషయంలోనూ ఇలా జరిగింది కాబట్టి ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పేలా లేదు. ఒక్క ఆకాశం నీ హద్దురా మాత్రమే అంచనాలకు మించి ఓటిటి బ్లాక్ బస్టర్ అయ్యింది. మలయాళం దృశ్యం 2 కూడా దీంతో చేర్చవచ్చు. మిగిలినవన్నీ దాదాపు పోయినవే. మరి ఓటిటి మార్చుకుంటున్న ప్లాన్లు చూస్తుంటే ప్రొడ్యూసర్లకు థియేటర్లే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తాయేమో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp