జూన్ లో రాబోయే సినిమాలేవి

By iDream Post May. 31, 2021, 01:00 pm IST
జూన్ లో రాబోయే సినిమాలేవి
లాక్ డౌన్ పూర్తవుతుందేమో అనుకుంటున్న తరుణంలో తెలంగాణలో మరో పది రోజులు పొడిగించేశారు. ఓ రెండు గంటలు అదనంగా మినహాయింపులు ఇచ్చారు అంతే. థియేటర్లకు దీని వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. ఎలా చూసుకున్నా జూన్ కూడా కృష్ణార్పణం అయినట్టే. ఏపిలోనూ ఇంచుమించు ఇదే తరహా వాతావరణం ఉంటుంది. సో ఈ నెల మీద అంతో ఇంతో ఆశలు పెట్టుకున్న మీడియం బడ్జెట్ నిర్మాతలకు నిరాశ తప్పలేదు. ఇక ఓటిటి తప్ప వేరే మార్గం కనిపించని చిన్న ప్రొడ్యూసర్లు ఎందరో. మేలో మొత్తం నాలుగు డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని రాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

పైకి చెప్పినా చెప్పకపోయినా పలు చిత్రాల నిర్మాతలు ఓటిటి సంస్థలతో చర్చల్లో ఉన్న మాట వాస్తవమేనని తెలుస్తోంది. అందులో పాగల్, మాస్ట్రో, దృశ్యం 2 లాంటి చెప్పుకోదగ్గ భారీ సినిమాలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. టక్ జగదీశ్ తరహాలో ఒకరిద్దరు వీటిని ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నారు కానీ పరిస్థితి అంచనా వేయడం ఎవరి వల్ల కావడం లేదు కాబట్టి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో చెప్పడం కష్టం. గత ఏడాది నాని వి, అనుష్క నిశ్శబ్దం కూడా ఇదే తరహా ప్రచారానికి నోచుకుని ఫైనల్ గా ప్రైమ్ లో ప్రత్యక్షమయ్యాయి. వాటి ఫలితాలు ఏమయ్యాయనేది పక్కనపెడితే విడుదల విషయంలో అనుకున్నదే జరిగింది.

సో జూన్ లో ఏ సినిమా థియేటర్లో అడుగు పెట్టే అవకాశం లేదనే క్లారిటీ వచ్చేసింది. మరి ఓటిటిలో ఎన్ని వస్తాయో వేచి చూడాలి. మరోవైపు తమిళం, మలయాళంలో ఈ ట్రెండ్ దూకుడుగా ఉంది. గత వారంలోనే ఏకంగా ఆరేడు సినిమాలు డిజిటల్ ఒప్పందాలు చేసుకున్నాయి. తాజాగా సోనీ లివ్ కూడా సౌత్ సినిమాల మీద కన్నేసి ఇక్కడి మార్కెట్ ని పెంచుకునే ప్లాన్లు వేస్తోంది. ఎటొచ్చి తెలుగుకు సంబంధించి పెద్దగా స్పష్టత దొరకడం లేదు. ఒకవేళ మూకుమ్మడిగా అందరూ జూలై దాకా వేచి చూసినా కష్టమే. అలా చేస్తే వారానికి కనీసం ఆరు సినిమాల దాకా రిలీజ్ చేయాల్సి రావొచ్చు. అదే జరిగితే సగం సీట్లతో అరకొర ఓపెనింగ్స్ తో అసలుకే మోసం వస్తుంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp