వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ - గట్టి పోటీనే

By iDream Post Mar. 01, 2021, 04:47 pm IST
వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ - గట్టి పోటీనే

నిన్నటి దాకా సైలెంట్ గా ఉన్న వైల్డ్ డాగ్ ఎట్టకేలకు బయటికి వచ్చాడు. అసలు ఎప్పుడు విడుదలవుతుందో తెలియని అభిమానుల అయోమయాన్ని బ్రేక్ చేస్తూ ఇవాళ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించేశారు. అయితే ఊహించని విధంగా కేవలం నెల రోజుల ముందు అనౌన్స్ చేయడం మాత్రం అనూహ్యమే. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. గతంలో నెట్ ఫ్లిక్స్ తో అగ్రిమెంట్ చేసుకునే దిశగా అడుగులు వేసినప్పటికీ సంక్రాంతి నుంచి జనం సినిమా హాళ్లకు మునుపటి లాగే వస్తుండటం చూసి ఫైనల్ గా మనసు మార్చుకున్నారు. సో తన ఇద్దరి పిల్లల చిత్రాల కన్నా ముందే నాగ్ దర్శనమివ్వబోతున్నాడు. వైల్డ్ డాగ్ ట్రైలర్ ని మార్చి 10న రిలీజ్ చేయబోతున్నారు.

అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న వైల్డ్ డాగ్ లో సయామి ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి తమన్ నేపధ్య సంగీతం సమకూర్చనుండటం మరో స్వీట్ షాక్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న వైల్డ్ డాగ్ లో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్ గా నటించాడు. ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్ తో చాలా గ్రిప్పింగ్ గా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇలాంటివి బిగ్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే అనుభూతి వేరు కాబట్టి దానికి అనుగుణంగానే నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది. ఇందాక ప్రెస్ మీట్ లోనూ ఈ పాయింట్ నొక్కి చెప్పారు.

ఇక నాగ చైతన్య లవ్ స్టోరీ అదే నెల ఏప్రిల్ 16న, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జూన్ 19న వస్తున్న నేపథ్యంలో కేవలం మూడు నెలల గ్యాప్ లో ముగ్గురి అక్కినేని సినిమాలు రాబోతున్నాయి. సుశాంత్ ఇచట వాహనములు నిలుపరాదు కూడా వస్తే దాన్ని బోనస్ గా పరిగణించవచ్చు. వైల్డ్ డాగ్ కి విడుదల రోజు గట్టి పోటీనే ఉంది. ఇప్పటికే మూడు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. గోపీచంద్ సీటిమార్, కార్తీ సుల్తాన్ ముందే ప్రకటించారు. అక్షయ్ కుమార్ సూర్యవంశీ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఏప్రిల్ 2ని గట్టి పోటీనే కనిపిస్తోంది. మిగిలిన వాటిలో మార్పు ఉండే అవకాశం తక్కువే. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp