తారక్ త్రివిక్రమ్ లు హస్తినకు వెళ్తారా ?

By Ravindra Siraj Jan. 20, 2020, 11:16 am IST
తారక్ త్రివిక్రమ్ లు హస్తినకు వెళ్తారా ?

కెరీర్లో త్రివిక్రమ్ తో చేయడానికి పాతిక సినిమాల వరకు వెయిట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత దాన్ని అరవిందసమేత వీరరాఘవ రూపంలో తీర్చుకున్న సంగతి తెలిసిందే. కాని అది ప్యూర్ ఫ్యాక్షన్ మూవీ కావడంతో ఫలితం సంతోషాన్ని ఇచ్చినా త్రివిక్రమ్ మార్కు డైలాగులు మిస్ అయ్యాయన్న లోటు మాత్రం అభిమానుల్లో ఉండిపోయింది. కాని అవుట్ పుట్ విషయంలో తారక్ ఫుల్ హ్యాపీ అని పలు ఇంటర్వ్యూలలో తనే చెప్పిన సంగతి తెలిసిందే.

Read Also: భయంకరమైన బూతు పోస్టర్

మరోసారి కలిసి చేస్తామని ఇద్దరూ ఆసక్తి చూపించడమూ ప్రేక్షకులు గమనించారు. ఇప్పుడిది కార్యరూపం దాల్చబోతోందని ఫిలిం నగర్ అప్ డేట్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా యాక్షన్ ని లైట్ గా మిక్స్ చేస్తూ త్రివిక్రమ్ ఆల్రెడీ ఓ స్టొరీ లైన్ ని జూనియర్ కు విన్పించాడట. వినగానే నచ్చేసిన తారక్ డెవలప్ చేయమని చెప్పినట్టు వినికిడిఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే టైటిల్ కూడా అనేసుకున్నారట. "అయినను పోయిరావలె హస్తినకు" .

Read Also: బోయపాటి కోసం బాలయ్య త్యాగం

ఇదేదో పౌరాణికం తరహలో వెరైటీగా ఉందనిపిస్తోంది కదూ. మొదట అలాగే అనిపించినా తర్వాత ఇదే యాప్ట్ అనిపించడం త్రివిక్రమ్ కు అలవాటే. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో టైటిల్స్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆ హీరోల ఇమేజ్ ఇవి సూట్ కావు కదా అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. కాని అలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆ రెండు కూడా ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే తారక్ విషయంలోtra అలాంటి క్రేజీ టైటిల్ కే త్రివిక్రమ్ మొగ్గు చూపుతున్నట్టు వినికిడి. మరి పురాణాల సంగతి పక్కన పెడితే అసలు జూనియర్ ని త్రివిక్రమ్ హస్తినకు ఎందుకు పంపాలనుకుంటున్నాడో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp