పుష్పకు ఆ విషయంలో నో టెన్షన్

By iDream Post Sep. 24, 2020, 01:20 pm IST
పుష్పకు ఆ విషయంలో నో టెన్షన్

అదేంటో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రతి సినిమాకు గ్యాప్ కోరుకున్నా కోరుకోకపోయినా ఆటోమేటిక్ గా వచ్చేస్తోంది. నా పేరు సూర్య డిజాస్టర్ తర్వాత ఏకంగా ఏడాదికి పైగా మేకప్ కి దూరంగా ఉన్న బన్నీ అల వైకుంఠపురములోతో తాను కోరుకున్న బ్లాక్ బస్టర్ సాధించాక కూడా లాక్ డౌన్ వల్ల ఆరు నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. పుష్పను నవంబర్ నుంచి రీ స్టార్ట్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఈ మేరకు అనుమతులు, యూనిట్ లో ఎంత మంది ఉండాలనే లెక్కలు, అక్కడ కరోనా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ టీమ్ పక్కాగా చెక్ చేసుకుని సిద్ధంగా ఉందని తెలిసింది. త్వరలో కేరళకు ప్రయాణం కాబోతున్నారు.

వైరస్ ఉదృతంగా ఉన్న పరిస్థితుల్లో పక్క రాష్ట్రానికి వెళ్లడం ఎందుకు ఇక్కడే వికారాబాద్, మెహబూబ్ నగర్, తూర్పు గోదావరి జిల్లాలు తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసేలా తొలుత అనుకున్నారు. కానీ దర్శకుడు సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్ కి ఆ లొకేషన్లు న్యాయం చేయలేవు. రాజీ పడితే అవుట్ ఫుట్ క్వాలిటీలో తేడా వచ్చేస్తుంది. అందుకే లేట్ గా అయినా సరే కేరళకు వెళ్లడం వల్ల నేటివిటీ పరంగా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. సో కాంప్రోమైజ్ కావడం వల్ల ఏదైనా తేడా జరుగుతుందేమోనన్న బన్నీ ఫ్యాన్స్ ఇక ఆ విషయంలో టెన్షన్ పడనక్కర్లేదు. సుకుమార్ తన రెగ్యులర్ శైలికి న్నంగా త్వరగా పూర్తి చేసేలా ఇప్పటికే ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చారట.

గతంలోలా ఎక్కువ రోజులు తీయడం రిపేర్ల పేరుతో పదే పదే రీ షూట్ లకు వెళ్లడం ఇకపై అంత సులభంగా సాధ్యం కాదు కాబట్టి వాటికి చెక్ పెట్టమని బన్నీ పర్సనల్ గా చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ రెడీ చేసేశాడు. రికార్డింగ్ అయ్యిందో లేదో తెలియాల్సి ఉంది. రష్మిక మందన్న కూడా వెంటనే సెట్స్ లోకి జాయిన్ అవుతుంది. విజయ్ సేతుపతి వదులుకున్న పాత్రను ఎవరు చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. జగపతిబాబు, బాబీ సింహా అని రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఫలానా అని ఖరారుగా చెప్పలేదు. వచ్చే ఏడాది జూన్ లేదా జులైకి రిలీజ్ ప్లాన్ చేసుకున్న పుష్క తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆలోగా అతనూ ఆచార్య పూర్తి చేసుకుని ఫుల్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉంటారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp