చిరు ఓపెన్ అయ్యారు కానీ

By iDream Post Apr. 05, 2020, 12:00 pm IST
చిరు ఓపెన్ అయ్యారు కానీ

ఆచార్యకు బ్రేక్ ఇచ్చి కరోనా రిలీఫ్ వర్క్స్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల శివ సినిమా గురించి, లూసిఫర్ ముచ్చట్లు కూడా కొన్ని పంచుకున్నారు. అయితే దేంట్లోనూ క్లారిటీగా చెప్పలేకపోవడంతో అభిమానులకు అయోమయం తప్పేలా లేదు. ఆచార్యలో మహేష్ బాబు క్యామియో చేస్తున్నాడనే టాక్ ఎలా వచ్చిందో తనకు తెలియదని, బిడ్డ లాంటి మహేష్ తో చేసే ఛాన్స్ వస్తే అది అద్భుతమవుతుందని చెప్పారు. అయితే కొరటాల శివ మనసులో మాత్రం రామ్ చరణే ఉన్నాడని రాజమౌళి కనక ఆర్ఆర్ఆర్ నుంచి కాస్త బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంటె ఇద్దరు కలిసి నటించాలనే భార్య సురేఖ కోరిక తీరుతుందని చెప్పారు.

అంతా బాగానే ఉంది కాని కీలకమైన ఆ పాత్ర గురించి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అంటే ఆశ్చర్యమే. చిరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మహేష్ ఆచార్యలో చేసే అవకాశాలు దాదాపు లేనట్టే. కొద్దిరోజుల క్రితం ఐడ్రీం పేర్కొన్నట్టు లూసిఫర్ రీమేక్ మీద తాను ఎంత పట్టుదలగా ఉన్నారో చిరు స్వయంగా వెల్లడించేశారు. దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదని, చేయడం మాత్రం ఖాయమని కుండబద్దలు కొట్టేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనక లూసిఫర్ రీమేక్ మీద ఆసక్తిగా ఉంటే ఇచ్చేస్తానని తాను డ్రాప్ అవుతానని కూడా చెప్పేశారు.

అయితే పవన్ ఇప్పుడున్న కమిట్మెంట్స్ లో ఇది చేయడం దాదాపు జరగని పనే. సో ఆచార్య తర్వాత చిరు చేయబోయేది లూసిఫర్ రీమేక్ అని అర్థమైపోయింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉన్న లూసిఫర్ ని ప్రేక్షకులు చూసేసి ఉంటారు కాబట్టి కథపరంగా చాలా కీలక మార్పులు అవసరం పడొచ్చు. కరోనా ప్రభావం కనక తగ్గకపోయి లాక్ డౌన్ కొనసాగితే సినీ కార్మికులకు కరోనా క్రైసిస్ చారిటి తరఫున సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పిన చిరంజీవి కోరుకోని వెకేషన్ ని మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp