క్రాక్ దర్శకుడికి కొత్త ఛాలెంజ్

By iDream Post Jan. 20, 2021, 01:03 pm IST
క్రాక్ దర్శకుడికి కొత్త ఛాలెంజ్

ఇండస్ట్రీలో ఏ దర్శకుడికైనా హిట్టు ఫ్లాపు కామనే కానీ ఎంత వేగంగా లేచి నిలబడ్డాం అనేదే ఇక్కడే ముఖ్యం. ప్రతికూలతలను తట్టుకుని నిలబడి సరైన సమయంలో సత్తా చాటితే విజయలక్ష్మి తనంతకు తానే వరిస్తుంది. దానికి ఉదాహరణగా గోపిచంద్ మలినేనిని చెప్పుకోవచ్చు. తన ఉనికిని గట్టిగా చాటుకోవాల్సిన అవసరంతో పాటు నాలుగు డిజాస్టర్లతో మార్కెట్ డౌన్ లో ఉన్న రవితేజకు బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన బాధ్యతను ఒకేసారి మోయాల్సి వచ్చింది. దానికి తగ్గట్టే క్రాక్ విషయంలో ఇతను చేసిన హోమ్ వర్క్, ఒక పర్ఫెక్ట్ మాస్ ఎంటర్ టైనర్ ఇవ్వడానికి చేసిన కృషి ఇవాళ గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. సంక్రాంతి విజేతగా నిలిపింది.

ఒక్కసారిగా రవితేజ పనైపోయిందనుకున్న వాళ్లకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. గోపీచంద్ మలినేని వెనుక మళ్ళీ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. అయితే తనకు ఇక్కడో కొత్త ఛాలెంజ్ ఉంది. ఇతను ఇప్పటిదాకా తీసిన సినిమాలు ఆరు. అందులో డాన్ శీను, బలుపు , క్రాక్ మూడూ మాస్ మహారాజా రవితేజతో హిట్టు కొట్టినవి. మిగిలిన వాటిలో వెంకటేష్ తో చేసిన తమిళ రీమేక్ బాడీ గార్డ్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. రామ్ తో తీసిన పండగ చేస్కో సోసో కమర్షియల్ పాస్ అనిపించుకుంది తప్ప మరీ గొప్పగా అయితే ఆడలేదు. ఇక సాయి తేజ్ విన్నర్ గురించి చెప్పాల్సిన పని లేదు. డిజాస్టర్ ఫలితం అందుకుంది.

ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన గోపిచంద్ రవితేజ కాకుండా ఇంకో హీరోతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన అవసరం ఉంది. తాజాగా వచ్చిన అప్ డేట్ మేరకు మైత్రి మూవీ మేకర్స్ లో డీల్ సెట్ చేసుకున్నట్టు సమాచారం. హీరో ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అధిక శాతం హీరోలు వాళ్ళ వాళ్ళ ప్రోజెక్టులతో బిజీగా ఉన్న నేపథ్యంలో కాంబో సెట్ కావడానికి కొంత టైం అయితే పట్టొచ్చు. క్రాక్ ఇచ్చిన కిక్ మాములుగా లేదు. ఇప్పుడు దీని తమిళ హిందీ రీమేక్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇంత గట్టిగ బౌన్స్ బ్యాక్ అయిన గోపిచంద్ మలినేని నెక్స్ట్ ఏ స్టార్ తో చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp