ఒక్క పాట - జీవితాలను మార్చేస్తోంది

By iDream Post Sep. 25, 2021, 04:30 pm IST
ఒక్క పాట - జీవితాలను మార్చేస్తోంది

తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న బుల్లెట్టు బండి పాట ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు. ఎక్కడ పెళ్లి జరిగినా అక్కడ ఈ సాంగ్ ప్లే చేయకుండా, డాన్స్ ఆడకుండా ఎవరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. మ్యూజిక్ షోలు పెడుతున్న మండపాల్లో కూడా డీజేలకు ముందే ఈ పాట ఉండేలా సెట్ చేసుకోమని పెళ్లి పెద్దలు చెబుతున్నారట. ఇప్పుడిది తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతోంది. లెక్కలేనన్ని కవర్ సాంగులు, ఇన్స్ టా రీల్స్, ట్విట్టర్ లో అనుకరణలు వచ్చేసాయి, వస్తూనే ఉన్నాయి. రోడ్డు మీద తన భర్త ముందు డాన్స్ చేసిన అమ్మాయి వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి ఇది ఒకటే హోరెత్తిపోతోంది.

ఒరిజినల్ గా ఈ పాట పాడిన మోహన భోగరాజుకు ఇప్పుడు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయట. ఆ గీతాన్ని తమ సినిమాలో పెట్టుకునేందుకు క్రేజీ ఆఫర్లు వచ్చినా కూడా తను నో చెప్పేసింది. యుట్యూబ్ లోనే ఉండాలని దానికి వచ్చిన గుర్తింపు అక్కడే శాశ్వతం కావాలని చెప్పేసిందట. ఇప్పుడు బుల్లెట్టు బండి అనే టైటిల్ తో ఏకంగా వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. సంతోష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ని ఇటీవలే బిగ్ బాస్ సోహైల్ తో లాంచ్ చేయించారు. పాటకైతే పేటెంట్ హక్కులు ఉంటాయి కానీ టైటిల్ కు కాదు కాబట్టి ఇలా రకరకాలుగా వాడకం జరిగిపోతోంది.

ఇక ఈ పాట రాసిన లక్ష్మణ్ కు, స్వరపరిచిన బాజీకు కూడా అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలోకి రావడానికి కష్టపడుతున్న వాళ్ళే. ఇప్పుడీ పాట వల్ల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేశారు. కాదేది టాలెంట్ కు అనర్హం అనే తరహాలో ఇలాంటి తెలంగాణ జానపదాలు వివిధ మార్గాల్లో ప్రాచుర్యం పొందటం పట్ల బాషా ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినడానికి గమ్మత్తుగా అనిపించే డుగుడుగు లాంటి పదాలు కూడా యమా పాపులర్ అయిపోయాయి. అంతేమరి టైం రావాలే కానీ ఒక్కసారి అది వచ్చిందంటే ఇదిగో ఇలాగే అదృష్ట దేవత తలుపు తడుతుంది

Also Read : కార్పొరేట్ కంపెనీలన్నింటికీ మహేషే కావాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp