బాహుబలితో నెట్ ఫ్లిక్స్ రిస్క్

By iDream Post Jun. 21, 2021, 08:03 pm IST
బాహుబలితో నెట్ ఫ్లిక్స్ రిస్క్

బాహుబలి రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. సందడి చేశాయి. వందల కోట్లు కొల్లగొట్టాయి. టీవీ ఛానల్స్ లో ఇప్పటికే విసుగొచ్చే స్థాయిలో టెలికాస్ట్ కూడా అయ్యాయి. ఇక ఆన్ లైన్ లో ఎన్ని కోట్ల మంది ఎన్ని లక్షల సార్లు చూసుంటారో చెప్పడం కష్టం. ఫైనల్ గా బాహుబలి ఒక చరిత్ర అంతే. మునుపటితో పోలిస్తే దీని క్రేజ్ తగ్గిన మాటా వాస్తవం. అయితే నెట్ ఫ్లిక్స్ మాత్రం బాహుబలిని ఒక మనీ ట్రీ లాగా చూస్తోంది. సరిగ్గా వాడుకుంటే తమ యాప్ కి పెద్ద బూస్టర్ గా పనికొస్తుందనే ఆలోచనతో దానికి ప్రీ క్వెల్స్ సీక్వెల్స్ ప్లాన్ చేస్తోంది. కాకపోతే సినిమాగా కాదు లెండి. వెబ్ సిరీస్ రూపంలోనే. గతంలో కొంత భాగం తీసి సరిగా రాలేదని వదిలేసింది కూడా.

అసలు బాహుబలి పుట్టక ముందు ఏం జరిగింది, శివగామి రాజమాతగా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి, ఆవిడ భర్తకు అవిటితనం ఎలా వచ్చింది లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా ఈ వెబ్ సిరీస్ లో పొందుపరుస్తారట. అయితే క్యాస్టింగ్ విషయంలో కాంప్రోమైజ్ కాకుండా పెద్ద పెద్ద నటీనటులను తీసుకోబోతున్నారట. అందులో భాగంగానే శివగామి క్యారెక్టర్ ను సమంతా కు ఆఫర్ చేశారని  రెమ్యునరేషన్ కూడా కనివిని ఎరుగని స్థాయిలో ఇస్తారని మీడియాలో గట్టి ప్రచారమే జరుగుతోంది. అయితే సామ్ దానికి ఏం స్పందన ఇచ్చిందో తెలియదు కానీ విశ్వసనీయ వర్గాల ప్రకారం నో అన్నదని వినికిడి

ఒకటి మాత్రం వాస్తవం. ఇప్పుడున్న టెక్నాలజీలో సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా దానికున్న స్పాన్ చాలా తక్కువ. ఒకప్పుడు స్పైడర్ మ్యాన్ లు సూపర్ మ్యాన్ లు రామాయణ మహాభారతాలు ఎన్నిసార్లు ఎన్ని రూపాల్లో చూపించినా వర్క్ అవుట్ అయ్యింది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మరి బాహుబలిని ఇంతేసి బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ క్యాష్ చేసుకోవాలని చేసే ప్రయత్నం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. అసలు శివగామి గురించి తెలుసుకునేంత ఆసక్తి జనంలో ఉందా అంటే డౌట్ అనే చెప్పాలి. ఒకవేళ నెట్ ఫ్లిక్స్ కనక సినిమాను తలదన్నే స్థాయిలో ప్రెజెంట్ చేస్తే తప్ప అద్భుతాలు ఆశించలేం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp