నీడ సినిమా రిపోర్ట్

By iDream Post Jul. 23, 2021, 03:34 pm IST
నీడ సినిమా రిపోర్ట్

మలయాళం తమిళ డబ్బింగులతో నెలకో అయిదారు సినిమాలు రిలీజ్ చేస్తున్న ఆహా యాప్ ఇవాళ విడుదల చేసిన మూవీ నీడ. నిజల్ పేరుతో కేరళలో థియేటర్లో ఆడిన ఈ చిత్రం అక్కడ పర్వాలేదనిపించుకుంది. ఇక్కడ హాళ్లలో ఇలాంటివి వర్కౌట్ కావు కాబట్టి మల్లువుడ్ నిర్మాతలు రీజనబుల్ రేట్లకు అనువాద హక్కులను ఇలా అమ్మేస్తున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటించడం, మిడ్ నైట్ మర్డర్స్ లాంటి వాటి ద్వారా మనకూ పరిచయమైన కుంచక్ బోబన్ మరో క్యారెక్టర్ చేయడంతో ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకుల్లో దీని మీద ఆసక్తి పెరిగింది. ఈజీగా ఇంట్లో చూసే సౌలభ్యంతో వచ్చిన ఈ నీడ ఎలా ఉందో సింపుల్ రిపోర్ట్ లో చూద్దాం

కట్టుకున్నవాడిని కోల్పోయిన షర్మిల(నయనతార)తన ఎనిమిదేళ్ల కొడుకు నితిన్(ఇజిన్ హష్)తో కలిసి జీవిస్తూ ఉంటుంది. తన క్లాస్ మేట్స్ తో క్రైమ్ స్టోరీస్ షేర్ చేసుకునే నితిన్ వాటిని పుస్తకంలో రాసుకుంటూ ఉంటాడు. ఈ విషయం అనుకోకుండా మేజిస్ట్రేట్ జాన్ బేబీ(కుంచక్ బోబన్)కి తెలుస్తుంది. అవన్నీ నిజంగానే జరిగాయని అర్థమయ్యాక షాక్ అవుతాడు. అసలు అంత చిన్న పిల్లాడికి జరగబోయే జరుగుతున్న క్రైమ్స్ ఎలా తెలుస్తున్నాయి అనే దాని మీద విచారణ మొదలుపెడతాడు. ఆ క్రమంలోనే విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయి.నితిన్ వెనుక నిజాలు ఏమిటి, షర్మిలకు కనెక్షన్ ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

నటన పరంగా మెయిన్ ఆర్టిస్టులు అందరూ చక్కగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ దర్శకుడు అప్పు ఎన్ భట్టహిరి ఫస్ట్ హాఫ్ లో మైంటైన్ చేసిన టెంపో రెండో సగంలో సరిగా క్యారీ చేయలేకపోవడంతో నీడ అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఎంత బాగున్నా క్యారెక్టరైజేషన్ల లోపల వల్ల ఇంపాక్ట్ తగ్గిపోయింది. అందులోనూ నయన్ మీద ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే నిరాశ తప్పదు. క్రైమ్ థ్రిల్లర్స్ విపరీతంగా ఇష్టపడేవాళ్ళకు ఓ మోస్తరుగా అనిపిస్తుంది తప్ప సాధారణ ప్రేక్షకులను మాత్రం నీడ సంతృప్తి పరచడం కష్టం. ట్విస్టులు బాగున్నా సరిగా డిజైన్ చేయలేదు. నీడ ఎక్కువ ఓపికను డిమాండ్ చేసే మాట వాస్తవం

Also Read: ప్రతిష్టాత్మక షోకి భారీ స్కెచ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp