నాని సినిమాలో అక్కినేని ఫార్ములా

By Ravindra Siraj Feb. 25, 2020, 02:01 pm IST
నాని సినిమాలో అక్కినేని ఫార్ములా

నిన్న న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా టక్ జగదీశ్ తర్వాత చేయబోయే కొత్త సినిమా తాలూకు టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. 2018లో విజయ్ దేవరకొండ టాక్సీ వాలాతో బాక్స్ ఆఫీస్ టెస్టు పాస్ అయిన రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా శ్యామ్ సింగ రాయ్ అనే పేరుతో నాని కొత్త సినిమా ఉండబోతోంది. కథకు సంబంధించి ఎలాంటి క్లూస్ ఇవ్వనప్పటికీ ఓ పాయింట్ మాత్రం లీకు రూపంలో ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇది పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందట.

మాములుగా ఈ థీమ్ వినగానే మనకు గుర్తొచ్చే సినిమా అక్కినేని నాగేశ్వర్ రావు గారి మూగ మనసులు. ఒకే ప్రేమ జంట రెండు జన్మల్లో కలుసుకోవడం అనే కథతో అప్పట్లో ఇది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ స్ఫూర్తితోనే నాగార్జున జానకీరాముడు, రామ్ చరణ్ మగధీర లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ తెలుగులో రూపొందాయి. ఇప్పుడు శ్యాంసింగరాయ్ కూడా అదే కోవలో ఉంటుందటఒక జన్మలో మహారాష్ట్రలో పుట్టిన జంటగా ఇంకో జన్మలో హైదరాబాద్ లో కలుసుకున్న ప్రేమికులుగా లేదా పెయిర్ మధ్య స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుందట.

అయితే ఇంతకు మించి ఎలాంటి సమాచారం దీని గురించి లేదు. నాని ఈ ఫార్ములా ట్రై చేయడం ఇదే మొదటిసారి. డ్యూయల్ రోల్ కాకపోయినా ఇలాంటి సినిమాల్లో ప్రేక్షకులు హీరోను రెండు పాత్రల్లో చూసిన ఫీలింగ్ ఉంటుంది. అందులోనూ నాని లాంటి యాక్టర్ చేశాడంటే అది ఇంకో లెవెల్ కు వెళ్ళిపోతుంది. టైటిల్ తప్ప ఇంకే వివరాలు వెల్లడించని టీమ్ విడుదల మాత్రం డిసెంబర్ అని ప్రకటించేసింది. అంటే పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుగుతుందన్న మాట. నాని వి వచ్చే నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ లెక్కన 2020లో నాని మూడు సినిమాలు విడుదల కావడం పక్కా అయిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp