నాగ్ మూవీ ఛాయల్లో నాని 'వి' ?

By Ravindra Siraj Feb. 24, 2020, 02:20 pm IST
నాగ్ మూవీ ఛాయల్లో నాని 'వి' ?

వచ్చే నెల 25న విడుదల కానున్న న్యాచురల్ స్టార్ నాని వి మీద టీజర్ వచ్చాక అంచనాలు అమాంతం ఎగబాకాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న కిల్లర్ పాత్రలో తమ హీరోని చూసి ఫ్యాన్స్ సైతం థ్రిల్ అవుతున్నారు. ఇంకో హీరో సుధీర్ బాబు కూడా ఉన్నప్పటికీ అందరి దృష్టి నాని మీదే ఉంది. ఈ నేపథ్యంలో దీని కథ ఏమై ఉంటుందా అనే టాక్ గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం నాని విలో మెయిన్ పాయింట్ అప్పుడెప్పుడో 1995లో క్రిమినల్ ని పోలి ఉంటుందట. అదెలా అంటారా మీరే చూడండి.

నాగార్జున సినిమాలో హీరో భార్యగా నటించిన మనిషా కొయిరాలా హత్యకు గురవుతుంది. కానీ చేయించిందెవరో ప్రేక్షకులతో సహా పాత్రలకు తెలిసుండదు. దీంతో దాన్ని శోధించే పనితో పాటు రివెంజ్ కూడా ప్లాన్ చేసుకుంటాడు నాగ్. తనను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసరైన మరో లవర్ రమ్యకృష్ణ, ఆమెపై అధికారి నాజర్ లు వెంటపడుతూ ఉంటారు. డ్రామా బాగానే ఉన్నప్పటికీ ఆ టైంలో ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయితే కీరవాణి పాటలు మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా తెలుసా మనసా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ట్రాక్.

ఇప్పుడు వి సంగతికి వస్తే ఇందులో కూడా నాని లవర్ గా నటించిన అదితి రావు హైదరిని ఎవరో చంపేస్తారట. వాళ్లెవరో పసిగట్టిన నాని చట్టానికి దొరక్కుండా ఒక్కొక్కరిని దారుణంగా హత్య చేయడం మొదలుపెడతాడు. ఇతన్ని పట్టుకునే మిషన్ మీద అపాయింట్ అవుతాడు సుధీర్ బాబు. ఇక అక్కడి నుంచి దొంగ పోలీస్ ఆట మొదలవుతుంది. నాని ఆడే బ్రెయిన్ గేమ్ కి డిపార్ట్ మెంట్ కి చుక్కలు కనిపిస్తాయి. ఇది వి గురించి వినిపిస్తున్న ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ కాదు కానీ లైన్ ప్రకారం చూసుకుంటే హీరో ప్రేమించిన పాత్రలు చనిపోవడం అనే పాయింట్ కామన్ గా కనిపిస్తోంది. ఇది నిజమా కాదా తెలియాలంటే మార్చ్ 25 దాకా ఆగాల్సిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న విలో మరో హీరోయిన్ గా నివేదా థామస్ నటిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp